రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు… జూమ్ వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించిన డిఐజి త్రివిక్రమ్ వర్మ, ఎస్పీ విజయరావు
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
జూమ్ వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించిన డిఐజి త్రివిక్రమ్ వర్మ, ఎస్పీ విజయరావు
నెల్లూరు క్రైం, ఆగస్టు 27 (సదా మీకోసం) :
జిల్లా పోలీసు అధికారులతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ను గుంటూరు రేంజ్ డిఐజి డా. సియం. త్రివిక్రమ్ వర్మ, జిల్లా ఎస్పీ సిహెచ్ విజయ రావు నిర్వహించారు.
ఈ సమీక్ష సమావేశంలో ఎస్ఐ స్థాయి నుండి పోలీసు అధికారులు అందరూ పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని.. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో 5 బ్లాక్ స్పాట్ లను గుర్తించి సంబంధిత అధికారుల సమన్వయంతో సైన్ బోర్డులు ఏర్పాటు చేసి అక్కడ సాధారణ స్థితికి తీసుకురావాలని ఆదేశించారు.
జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే టాప్ 5 స్టేషన్ లపై ప్రత్యెక దృష్టి సారించాలని ఆదేశించారు.
హైవే పెట్రోలింగ్ వాహనాలను ముమ్మరం చేయాలని, వాహనాల జీపిఎస్ తీరును పరిశీలించాలని, తరచుగా ప్రమాదాలు జరిగే ప్రదేశాలలో ప్రత్యెక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గత 6 నెలలలో జరిగిన రోడ్డు ప్రమాదాల జాబితా ఆధారంగా ప్రణాలికలు రచించాలని సూచనలు చేశారు.
గంజాయి, మద్యం, గుట్కా అక్రమ రవాణా అరికట్టుటలో పోలీసు అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని సూచించారు.
పోక్సో, రేప్ కేసులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెండింగ్ కేసులలో దర్యాప్తు వెంటనే పూర్తి చేయాలని, ప్రత్యెక దృష్టి సారించాలని పేర్కొన్నారు.
కుటుంబ తగాదాలు, భూవివాదాలలో హత్య కేసులుగా మారకుండా రెవిన్యూ శాఖ సహకారంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
పాత నేరస్థులు, జైలు నుండి బయట వచ్చిన ముద్దాయిలపై ప్రత్యెక నిఘా ఉంచాలని సూచించారు.
పోలీసు అధికారులకు డిఐజీ త్రివిక్రమ్ వర్మ సూచనలు, సలహాలు అందించారు.