ఎన్సీడీ సర్వే పక్కా ప్రణాళికతో నిర్వహించాలి : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పెంచలయ్య
ఎన్సీడీ సర్వే పక్కా ప్రణాళికతో నిర్వహించాలి
సత్వర వైద్య సేవలు అందించాలి
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పెంచలయ్య
నెల్లూరు వైద్యం, జూలై 8 (సదా మీకోసం) :
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో డియంహెచ్వో డాక్టర్ పెంచలయ్య అధ్యక్షతన జిల్లాస్థాయి అసంక్రమణ వ్యాధుల నివారణ కార్యక్రమంపై వైద్యాధికారులకు శిక్షణ ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా డిఎంహెచ్వో పెంచలయ్య మాట్లాడుతూ ఎన్సీడీ సర్వే పక్కా ప్రణాళికతో నిర్వహించి, కేసులను గుర్తించి, సత్వర వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
రాష్ట్ర ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ అసంక్రమణ వ్యాధులు చాప కింద నీరులా ప్రజల్లో వ్యాపిస్తున్నందున వైద్యాధికారులు వీటి గుర్తింపులో అలసత్వం వహించక వెంటనే రెఫర్ చేయాలన్నారు.
డాక్టర్ రాజ్ కిరణ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అసంక్రమణ వ్యాధులైన క్యాన్సర్, డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు వగైరాలను ఏ విధంగా నివారించవచ్చునో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై వివరంగా తెలిపారు.
కార్యక్రమంలో డాక్టర్ సుధీర్, డాక్టర్ దయాకర్, డాక్టర్ భాస్కర్, డెమో శ్రీనివాసరావు, డిపిఓ రమేష్, డిప్యూటీ డెమో శ్రీనివాసులు తదితర అధికారులు పాల్గొన్నారు.