పదవి విరమణ చేస్తున్న పోలీసు అధికారులకు ఆత్మీయ వీడ్కోలు

0
Spread the love

పదవి విరమణ చేస్తున్న పోలీసు అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలికిన అడిషనల్ యస్.పి.(అడ్మిన్)

  • సుదీర్ఘ కాలం విధులు నిర్వహించి పదవి వీరమణ పొందడం అభినందనీయం
  • కేవలం కుటుంబ సభ్యుల సహకారంతో మీరు ఇన్ని సంవత్సరాలు దిగ్విజయంగా విధులు నిర్వహించారు
  • పోలీసు డిపార్ట్మెంట్ లో ప్రజా సేవకే మీ సమయం, శక్తి అన్ని వినియోగించినందుకు డిపార్ట్మెంట్ తరపున ధన్యవాదాలు
  • నాకు కరోనా సోకిన సమయంలో అధికారుల తోడ్పాటు మరువలేనిది- నేను బ్రతికి ఉన్నానంటే కారణం మీరే
  • తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవడం పిల్లల బాధ్యత.. ఓపికతో బాగా చూసుకోండి
  • పదవి వీరమణ పొందిన 13 మంది పోలీసులను సన్మానించిన జిల్లా అడిషనల్ యస్.పి.(అడ్మిన్)

-: నెల్లూరు క్రైమ్, జూన్ 30 (స‌దా మీకోసం) :-

ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ నందు నేడు ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులు మొత్తము పదమూడు మంది. (1) Addl.SP(Craims) యస్. వెంకటేశ్వరరావు గారు (2) SI-1044, SD.సిరాజుద్దీన్, VR (3) SI-1458 CH. రాదయ్య, SEB (4) RSI-4111 NG శంకరుడు, DAR నెల్లూరు (5) ASI-1476 G.సుబ్బారావు, నెల్లూరు రూరల్ (6) ASI-249 SK.సలీం, దర్గామిట్ట (7) ARSI-1209 S.MD గౌస్, DAR నెల్లూరు (8) ARSI-1474 MD.రియాజ్, DAR నెల్లూరు (9) HC-744 M.రమణయ్య, బాలాజీనగర్ (10) PC-339 G.కృపదాస్, A.సాగరం (11) PC-539 T.బాలకృష్ణ, కండలేరు (12) HG-49 U.సుబ్బు సింగ్ (13) HG-578 N.సుబ్బారావు గార్లను నెల్లూరు జిల్లా అడిషనల్ యస్.పి.(అడ్మిన్) పి.వెంకటరత్నం, ఇతర అధికారులు, పోలీసు కుటుంబాల సమక్షంలో ఘనముగా సన్మానం చేసి జ్ఞాపికలతో మరియు పూలమాలలతో సత్కరించడం జరిగినది.

ఈ సందర్భంగా అడిషనల్ యస్.పి.(అడ్మిన్) మాట్లాడుతూ సుదీర్ఘ కాలం క్రమశిక్షణతో, బాధ్యతయుతంగా విధులు నిర్వహించి పదవి వీరమణ పొందడం అభినందనీయమని, ఇన్ని రోజులు చట్టాలకు అనుగుణంగా విధులు నిర్వహించారని, రేపటి నుండి స్వేఛ్చగా ప్రాధమిక విధులను వినియోగించుకోవచ్చని తెలిపారు.

మనమంతా ఒకే పోలీసు కుటుంబం అని, ఈ రోజు పదవీ విరమణ పొందిన అధికారులు అందరూ ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి అవసరం వచ్చినా, ఎక్కడ ఉన్నా సరే అన్నీ విధాలా సహాయ సహకారాలు అందిస్తానని అడిషనల్ యస్.పి. తెలిపారు.

నేటి నుండి వారి తల్లిదండ్రులు దైవసమానులని, వారిని అన్నీ విధాలా ఆదరిస్తూ, ప్రేమతో చూసుకోవాలని తెలుపుతూ ఘనంగా వీడ్కోలు పలికారు.

అధికారుల యొక్క మిగిలిన శేష జీవితాన్ని మంచి ఆరోగ్యంతో సుఖంగా గడపాలని ఆకాంక్షించారు. సమాజం కోసం వీరంతా సుమారు మూడు నుంచీ నాలుగు దశాబ్దాలు పాటు సేవలందించి జీవితాలను పునీతం చేసుకున్నారని తెలిపారు.

అడిషనల్ యస్.పి.(క్రైమ్స్) మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉద్యోగ బాధ్యతలను విజయవంతంగా ముగించడం ఆనందదాయకమని, డిపార్ట్మెంట్ నందు ఎంతో నేర్చుకున్నానని, ఎన్నో సమస్యలు పరిష్కరించానని, మా పిల్లలకు అన్నీ నేర్పించా కనుక ఒక మంచి స్థాయిలో ఉన్నారని, ఈ రోజు నెల్లూరు పోలీసుల సమక్షంలో సంతోషంగా పదవీవిరమణ పొందుతున్నానని తెలిపారు.

అనంతరం అడిషనల్ యస్.పి. (SEB) మాట్లాడుతూ ఇది కేవలం మీ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా సతీమణి సహకారంతోనే సాధ్యం అయిందని, శేష జీవితంలో కూడా ఉల్లాసంగా జీవించేలా వాకింగ్, పుస్తక పఠనం తదితర అలవాట్లను పాటించాలని తెలియపర్చినారు.

అడిషనల్ యస్.పి.(AR) మాట్లాడుతూ కరోనా సమయంలో కఠినమైన విధులు నిర్వహించారు.

అంతేకాకుండా కరోన సోకిన సిబ్బందికి చాలా తోడ్పాటును అందించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమానికి పోలీసు వెల్ఫేర్ RI శ్రీకాంత్ అధ్యక్షత వహించగా, డి.యస్.పి.(HG) శ్రీనివాసరావు, CI CCS బాజీజాన్ సైదా, చిన్న బజారు CI మధుబాబు, RI(అడ్మిన్) శ్రీనివాసులురెడ్డి, RI(HG) పౌల్ రాజ్, అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రసాద్, పదవీ విరమణ పొందుతున్న అధికారుల కుమారులు, కుమార్తెలు ఉన్నత ఉద్యోగాలలో ఉండడం సంతోషకరమైన విషయమని, వీరి జీవితం ఆనందమయంగా సాగిపోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!