ఢిల్లీలో జరుగు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు వి.ఎస్.యూ ఎన్ఎస్ఎస్ (NSS) వాలంటీర్లు
ఢిల్లీలో జరుగు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు వి.ఎస్.యూ ఎన్ఎస్ఎస్ (NSS) వాలంటీర్లు
-: వెంకటాచలం, ఆగష్టు 11 (సదా మీకోసం) :-
ఢిల్లీలో జరుగు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు జిల్లాలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం (VSU) నుంచి ఇద్దరు ఎన్ఎస్ఎస్ (NSS) వాలంటీర్లు ఎంపికైనట్లు సమన్వయకర్త డాక్టర్ ఉదయ్ శంకర అల్లం తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపికైన ఎన్ఎస్ఎస్ (NSS) వాలంటీర్లను ఉపకులపతి (Vice Chancellor) ఇంచార్జ్ ఆచార్య ఎస్. విజయభాస్కర రావు ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ విద్యార్థులలో మనోవికాసాన్ని, నాయకత్వపు లక్షణాల్ని పెంపొందించడానికి ఒక మంచి వేదికగా ఉపయోగపడుతుందని అన్నారు.
ఆంధ్ర రాష్ట్రం నుంచి 20 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఎంపిక కాగా వారిలో ఇద్దరు విశ్వవిద్యాలయం నుంచి ఉండటం ఆనందం వ్యక్తపరిచారు.
భారత ప్రభుత్వం మొట్టమొదటిసారిగా స్వాతంత్ర వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని NSS వాలంటీర్లకు కల్పించడం సంతోషదాయకమన్నారు.
విశ్వవిద్యాలయం పరిధిలో ఎన్ఎస్ఎస్ యూనిట్ కలిగి ఉన్న ప్రతి కళాశాల విద్యార్థులను ఎన్ఎస్ఎస్ ద్వారా సమాజాభివృద్ధికి మరియు సామాజిక సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేటట్లు ప్రోత్సహించాలని కోరారు NSS వాలంటీర్లు శ్రీ పొట్టి రాములు నెల్లూరు జిల్లా (SPSR Nellore), విశ్వవిద్యాలయం పేరు ప్రతిష్టలను రాష్ట్ర, దేశస్థాయిలో నిలబెట్టాలని కోరారు.
ఎంపికైన వి ఎస్ యూ కళాశాల ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు, యుగంధర్ రెడ్డి, ఇండ్ల లవకుమార్ రెడ్లను రిజిస్ట్రార్, డా. కే. సునీత కుమారి, ప్రిన్సిపాల్ ఆచార్య వి హెచ్ విజయ, సమన్వయ కర్త డా. ఉదయ్ శంకర్ అల్లం, ప్రోగ్రాం అధికారులు డా. కే. విద్యా ప్రభాకర్, డా. బి వి సుబ్బారెడ్డి మరియు ఇతర అధ్యాపకులు అభినందించారు.
|