జింకల పార్కును సందర్శించిన జిల్లా అటవీశాఖ అధికారి

జింకల పార్కును సందర్శించిన జిల్లా అటవీశాఖ అధికారి
వన్యప్రాణులకు నీటి కొరత లేకుండా చూడాలి
జింకలకు మేత వేసే విధానాన్ని పరిశీలించిన జిల్లా అటవీశాఖ అధికారి వైవీకె షణ్ముక్ కుమార్
రాపూరు, మార్చి 22 (సదా మీకోసం) :
వేసవి కాలం సమీపిస్తున్న తరుణంలో జింకలకు నీటి కొరత లేకుండా చూడాలని జిల్లా అటవీశాఖ అధికారి వైవీకె షణ్ముక్ కుమార్ సిబ్బందిని ఆదేశించారు.
మంగళవారం రాపూరు మండలంలోని కండలేరు జింకల పార్కును ఆకస్మికంగా సందర్శించారు.
జింకలకు నీరు పెట్టె తొట్టెలను, మేత పెట్టె విధానాన్ని పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. జింకల పార్కు చుట్టూ తిరిగి కంచెను పరిశీలించారు.
వన్యప్రాణుల నీరు నిల్వఉంచిన సాసర్ పిట్లను పరిశీలించి ఎన్ని రోజులకు నీటిని మారుస్తారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
వేసవికాలంలో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు సాల్ట్ లీక్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
ఆయన వెంట వెంకటగిరి సబ్ డిఎఫ్వో జ్ఞాన ప్రకాష్ రావు, రాపూరు అటవీశాఖ రేంజి అధికారి ఎస్. హరి, దాచూరు డిఆర్వో డీ.వంశీకృష్ణ, బిట్ అధికారి ఆర్.శ్రీనివాసులు, అటవీశాఖ సిబ్బంది ఉన్నారు.