ఐక్యంగా ఉంటేనే శక్తిగా ఎదుగుతాo : బుసగాని లక్ష్మయ్య యాదవ్

ఐక్యంగా ఉంటేనే శక్తిగా ఎదుగుతాo
అఖిలభారత యాదవ మహా సంఘం జాతీయ అధ్యక్షులు బుసగాని లక్ష్మయ్య యాదవ్
రాపూరు, సెప్టెంబర్ 18 (సదా మీకోసం) :
యాదవులు ఐక్యంగా ఉంటేనే శక్తిగా ఎదిగే సామర్థ్యం ఉందని,అయితే ఐక్యమత్యంతోనే అది సాధ్యమవుతుందని అఖిలభారత యాదవ మహా సంఘం జాతీయ అధ్యక్షులు బుసగాని లక్ష్మయ్య యాదవ్ అన్నారు.
రాపూరు శ్రీబాలాజీ కళ్యాణ మండపంలో ఆదివారం జరిగిన అఖిల భారత యాదవ సంఘం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
అనంతరం వెంకటగిరి నియోజకవర్గ యాదవ సంఘం నాయకులు చాట్ల మునిరాజా ఆధ్వర్యంలో ఉమ్మడి నెల్లూరు,తిరుపతి జిల్లాల నాయకుల సమక్షంలో రాపూరు మండల యాదవ కార్యవర్గ కమిటీని ప్రకటించారు.
రాపూరు మండలం యాదవ సంఘం అధ్యక్షులుగా ఇసళ్ళ సూర్య ప్రకాష్ యాదవ్,ఉపాధ్యక్షులుగా పిట్టబోయిన వెంకటసుబ్బయ్య, ఆవుల చెంచయ్య,కూకటి పెంచలయ్య,లీగల్ సెల్ అధ్యక్షులుగా మట్టెo మునిప్రసాద్,గౌరవ అధ్యక్షుడు గా సూరేపల్లి అంకయ్య,గౌరవ ఉపాధ్యక్షుడుగా గోళ్ళ కొండయ్య,యువజన అధ్యక్షుడుగా మందాటి చంద్రమోహన్,యువజన ఉపాద్యక్షులుగా పల్లమాల మల్లేశ్వర్,పిట్టబోయిన శివయ్య, బిల్లు వెంకటరత్నం,కార్యవర్గ సభ్యులుగా సంకల పాపయ్య,పిల్లకదుపు రాధాకృష్ణ, అల్లం రాఘవయ్య,గుమ్మా వెంకటేశ్వర్లు,కట్టేబోయిన ప్రసాద్,మద్దే గంగాధర్,అంబటి సురేష్ కుమార్,పెరమళ్ల వెంకటరత్నం, చింకర్ల చెంచయ్య,మోడిబోయిన రాఘయ్య ను నియమించారు.