ఆటో నగర్ వాసుల 40 ఏళ్లనాటి కళ సాకారం : రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

ఆటో నగర్ వాసుల 40 ఏళ్లనాటి కళ సాకారం
రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
నెల్లూరు రూరల్, జూలై 19 (సదా మీకోసం) :
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 29వ డివిజన్ ఆటో నగర్ ను గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆటో నగర్ వాసుల 40 ఏళ్లనాటి కళ 22 కోట్ల రూపాయల వ్యయంతో రోడ్లు, కాలువ పనులను పూర్తిచేయడం జరిగిందని, జూలై 21 వ తేది రాష్ట్ర మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, గుడివాడ అమర్నాధ్ ల చేతులమీదుగా ప్రారంభిస్తామని తెలిపారు.
ఆటో నగర్ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించిన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కి నెల్లూరు జిల్లా ఆటో నగర్ వాసుల అందరి తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్రంలోనే ఆటో నగర్ ఎలావుండాలి అంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎలా ఉందొ ఆలా ఉండాలని, రాష్ట్రానికే ఒక ఆదర్శంగా తీర్చిదిద్దే విధంగా పనులను పూర్తిచేసామని అన్నారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గం నానాటికి విస్తరిస్తూ, పరిశ్రమలతో వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది కావున మరో ఆటో నగర్ ను ఏర్పాటు చేసేందుకు ఓ శాసనసభ్యుడిగా తన వంతు ప్రయత్నిస్తానని తెలిపారు.
కార్యక్రమంలో 29వ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ సత్తార్, 27వ డివిజన్ కార్పొరేటర్ భీమినేని మురహరి, 29వ డివిజన్ అధ్యక్షులు కొండా సాయి రెడ్డి, 26వ డివిజన్ అధ్యక్షులు పురుషోత్తం యాదవ్, 28వ డివిజన్ అధ్యక్షులు చెక్క సాయి సునీల్, స్థానిక వైసీపీ నాయకులు, స్థానిక ఆటో నగర్ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు, ఆర్గనైజింగ్ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అనీల్