ఇసుక సరఫరాలో ప్రభుత్వ కార్యక్రమాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి : కలెక్టర్
ఇసుక సరఫరాలో ప్రభుత్వ కార్యక్రమాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి : కలెక్టర్
-: నెల్లూరు కలెక్టరేట్, ఆగస్టు 8 (సదా మీకోసం) :-
నెల్లూరు నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం.., కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు, జాయింట్ కలెక్టర్ డా. వి.వినోద్ కుమార్ తో కలిసి.., డిస్ట్రిక్ లెవల్ శాండ్ కమిటీ మీటింగ్ నిర్వహించారు.
సంగం ఆయకట్టులో 2వ పాయింట్.., ఇసుక పూడిక తీయడానికి అవసరమైన అనుమతులను కలెక్టర్ మంజూరు చేశారు.
ప్రభుత్వ కార్యక్రమాలకు ఇసుక సరఫరా చేయడానికి తొలుత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
దీంతో పాటు.., జిల్లాలోని 28 గ్రామాల్లో ప్రజల వ్యక్తిగత అవసరాల నిమిత్తం.., ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉచితంగా ఇసుక సరఫరా చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఇసుక సరఫరా పారదర్శకంగా ఉండాలని, ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఇసుక సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని, దీనిని ఉల్లంఘిస్తూ.., అక్రమంగా ఇసుక నిల్వ చేసినా? రవాణా చేసినా వారిపై చట్టపరమైన చర్యల తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్షా, సమావేశంలో మైనింగ్ శాఖ అధికారి కె.ఎల్.వి. ప్రసాద్, డి.పి.ఓ పి.ధనలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.