14వ డివిజన్ లో పింఛన్ల పంపిణీ చేసిన కర్తం ప్రతాప్ రెడ్డి
14వ డివిజన్ లో పింఛన్ల పంపిణీ చేసిన కర్తం ప్రతాప్ రెడ్డి
-: నెల్లూరు, ఆగస్టు 1 (సదా మీకోసం) :-
14వ డివిజన్ లోని లబ్ధిదారులకు డివిజన్ వైసీపీ ఇంచార్జ్ కర్త0 ప్రతాపరెడ్డి ఇంటి0టింకి వెళ్లి అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందజేస్తున్న పింఛన్లను నీటిపారుదల శాఖా మంత్రి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాలతో 14వ డివిజన్‌లో పించన్లు అందజేస్తున్నట్లు తెలిపారు.
బ్రాహ్మణ కుటుంబాలకు ప్రభుత్వం అందజేసిన పింఛన్ల తోపాటు కొత్తగా మంజూరు అయిన పింఛన్లు ఉన్నాయని తెలిపారు.
33 మంది బ్రాహ్మణ సోదరులు, సోదరిమణుల కు నేరుగా వారి ఇంటికి వెళ్లి పించన్ల సొమ్మును అందజేసే ప్రక్రియను వాలంటీర్లతో కలసి చేపట్టినట్లు తెలిపారు.
నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బ్రాహ్మణ కుటుంబాలకు అండగా ఉంటున్నారని, వారి ఆదేశాలపై ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.
బ్రాహ్మణులకు ఏ సహాయం కావాలన్న తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, వారి సమస్యలను మంత్రి అనిల్ కుమార్ యాదవ్ దృష్టికి తీసుకు వెళ్లి వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం ఆయన కొత్తగా మంజూరు అయిన మరో 44 మంది లబ్ధిదారులకు పించన్ల మొత్తాలను అందజేశారు.
కొంతమంది వాలంటీర్లకు కరోన సోకడంతో వారు రాలేకపోయినందువల్ల హెల్త్ సెక్రటరీలు.ఇతర సిబ్బంది సహకారంతో ఈ పించన్ల పంపిణీ జరిపామని తెలిపారు.
డివిజన్ లో వివిధ ప్రాంతాలలో పర్యటించి బ్లీచింగ్ చల్లించడం తో పాటు హైడ్రోక్లోరైడ్ ద్రావకాన్ని పిచికారీ చేయించినట్లు తెలిపారు.
గిరిజన సంఘంలో పర్యటించి అక్కడి ప్రజలతో మాట్లాడి జాగ్రత్తలు చెప్పారు.ఏ అవసరం వచ్చినా తనకు తెలిపితే సమస్యలను పరిష్కరిస్థానని హామీ ఇచ్చారు.