యస్.యస్.డి. జిల్లా అధ్యక్షుడుగా కార్తికేయ
యస్.యస్.డి. జిల్లా అధ్యక్షుడుగా కార్తికేయ
ఇందుకూరుపేట, జూలై 25 (సదా మీకోసం) :
సమతా సైనిక్ దళ్ (యస్.యస్.డి.) నెల్లూరు జిల్లా అధ్యక్షుడుగా పోలవరపు కార్తికేయ ను నూతనంగా నియమించినట్లు ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు పాలేటి మహేశ్వరరావు తెలిపారు.
నిన్న విజయవాడలో జరిగిన యస్.యస్.డి. రాష్ట్రస్థాయి సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులందరూ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుని, ఆ మేరకు సమావేశంలో ప్రకటన చేశారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర SC. కమీషన్ చైర్మన్ మారుముడి విక్టర్ ప్రసాద్ చేతుల మీదుగా జిల్లా అధ్యక్షుడు నియమిత పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా కార్తికేయ మాట్లాడుతూ ప్రపంచ మేధావి, భారతరత్న, బాబా సాహెబ్ డాక్టర్ బి.అర్ అంబేడ్కర్ స్వయంగా 1924 లో స్థాపించిన సమతా సైనిక్ దళ్ సంస్థలో పని చేసేందుకు అవకాశం రావడం చాలా సంతోషంగా వుందన్నారు.
ఇక నుండి దళితుల సమస్యలపై దృష్టి సారించి, సమస్యల పరిష్కారానికి తన వంతు సహాయ, సహకారాలు అందిస్తానని,తమ జాతి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.