కోవిడ్ – 19 నివారణ చర్యలకు కృష్ణపట్నం పోర్టు చేయూత
కోవిడ్ – 19 నివారణ చర్యలకు కృష్ణపట్నం పోర్టు చేయూత
-: నెల్లూరు, ఆగస్టు 1 (సదా మీకోసం) :-
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కోవిడ్ – 19 నివారణకై మరింత విస్తృత చర్యలు చేపట్టుటలో భాగంగా కృష్ణపట్నం పోర్టు తరఫున 25 లక్షల రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ కె.వి. ఎన్ చక్రధర్ బాబుకు శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కృష్ణపట్నం పోర్ట్ పి ఆర్ ఓ వేణుగోపాల్ అందజేశారు.
కోవిడ్ 19 నివారణ చర్యలు పోర్టులో సమగ్రంగా నిర్వహిస్తూ, ప్రాంరభం నుండి కరోనాను అడుకునేందుకు సానిటైజేషన్ వంటి చర్యలలో ముందున్న కృష్ణపట్నం పోర్టు జిల్లా ప్రజల కోసం 25 లక్షల చెక్కు కలెక్టర్ చక్రధర్ బాబుకు అందించడం గమనార్హం.