స్పందనలో పాల్గొన్న ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజా మురళీ
స్పందనలో పాల్గొన్న ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజా మురళీ
బుచ్చిరెడ్డి పాళెం, మార్చి 28 (సదా మీకోసం) :
బుచ్చి నగర పంచాయితీ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజామురళీ పాల్గొని పలు అర్జీ లను స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు.
ఛైర్ పర్సన్ మాట్లాడుతూ, స్పందనలో నేడు వచ్చిన ఇళ్ళు స్థలాలు, కాలనీ ఇళ్లకు సంబంధించిన అర్జీలను రెవెన్యూ, హౌసింగ్ శాఖ అధికారులతో మాట్లాడి పరిష్కరించినట్లు తెలిపారు.
స్పందన కార్యక్రమంలో పాల్గొన్న విద్యుత్ శాఖ ఏడి శీనయ్య, ఏఈ ధనపాల్ లతో బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయితీ పరిధిలో శిధిలావస్థలోనున్న కరెంటు లైన్ స్తంభాలను మార్చాలని కోరారు. వారు స్పందించి వెంటనే మారుస్తామని తెలిపారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయితీ ప్రజలంతా ఉపయోగించుకొని వారి సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు షకీలా బేగం, శ్రీదేవి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.