లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్
నెల్లూరు క్రైం, నవంబర్ 30 (సదా మీకోసం) :
ఫెంగల్ తుఫాన్ తీరం దాటుతున్న నేపథ్యంలో జిల్లా పోలీసు సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ లో సహాయక చర్యల ప్రత్యేక బృందాలను సిధ్దంగా ఉంచి, పరిస్థితులను బట్టి సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా పోలీసు యంత్రాంగాన్ని జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఆదేశించారు.
రెవిన్యూ, ఇతర శాఖల సమన్వయంతో ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.
వర్షాల దృష్ట్యా ప్రజల సహాయార్థం, సహాయక చర్యల కోసం పోలీసు సిబ్బంది 24×7 అందుబాటులో ఉండాలని తెలిపారు.
గ్రామీణ ప్రాంత పరిధిలో, వంకలు, వాగులు ప్రవహించు, లోతట్టు ప్రాంతంలో నివసించు ప్రజలను పోలీసు సిబ్బంది అప్రమత్తం చేస్తున్నారు.
నదులు, వాగులు, వంకలు, చెరువులు, జలాశయాలు, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో సురక్షితంగా ఉండేలా రెవిన్యూ అధికారులతో కలిసి సహాయక చర్యలలో నిమగ్నం అయ్యారు.
గాలులు వీస్తున్న కారణంగా పాత ఇండ్లు, రేకుల షెడ్డులు, భోద ఇండ్లు మొదలగు వాటిని గుర్తించి అక్కడ నివసించే వారిని అప్రమత్తం చేసి వారికి కావలసిన కనీస సదుపాయాలను కల్పించాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.
24×7 అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, భారీ వర్షాలు, వరదల వలన ఏమైనా ఘటనలు తలెత్తినా, అత్యవసర పరిస్థితి వచ్చినా, సమస్యలకు గురైనా ప్రజలు, వెంటనే డయల్ – 112 లేదా పోలీసు కంట్రోల్ రూమ్ వాట్సాప్ నంబర్ 9392903413 నకు సమాచారం తెలపాలని జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ సూచించారు.