ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులకు తగిన సదుపాయాలు కల్పించండి : కలెక్టర్

ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులకు తగిన సదుపాయాలు కల్పించండి
అధికారులను ఆదేశించిన కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు
-: కోవూరు, ఆగస్టు 12 (సదా మీకోసం) :-
నెల్లూరు జిల్లా కోవూరులో బుధవారం సాయంత్రం కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు పర్యటించారు.
కోవూరులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్…, వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ, సివిల్ సప్లైస్ అధికారులతో సమీక్షా, సమావేశం నిర్వహించారు.
ధాన్యం కోతలు ప్రారంభమవుతున్నందువల్ల.., రైతులకు మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు.
జిల్లాలో 65 ధాన్యంకోనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతున్నాయని.., ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులకు తగిన సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.
వర్షాల వలన కోత కోసిన ధాన్యం తడిసి, రైతులు నష్టపోయే అవకాశం ఉందని.., రైతులకు త్వరితగతిన టార్బాలిన్ పట్టలు అందించాలన్నారు.
రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన వెంటనే.., రెండు రోజుల్లోపు వారికి డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లా అధికారుల అంచనాల ప్రకారం 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని.., దానికి అనుగుణంగా అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఈ పర్యటనలో సివిల్ సప్లైస్ డి.ఎం. రోజ్ మాండ్, డి.ఎస్.ఓ, కోవూరు ఎమ్మార్వో, అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
నిరుపేద మహిళల ఆర్థికాభివృద్ది వై.యస్.ఆర్ చేయూతతోనే : గోతం బాలకృష్ణ
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవిద్ – 19 హెల్త్ బులిటెన్ 12-08-2020