జిల్లా ఇంచార్జ్ మంత్రి బాలినేనిని కలిసిన ఆనందయ్య

జిల్లా ఇంచార్జ్ మంత్రి బాలినేనిని కలిసిన ఆనందయ్య
-: నెల్లూరు, జూన్ 26 (సదా మీకోసం) :-
ఆయుర్వేద వైద్యులు ఆనందయ్య ఈ రోజు నెల్లూరు లోని రహదారులు భవనాలు శాఖ అతిధి గృహంలో జిల్లా ఇంచార్జి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిశారు.
కరోనా నివారణకు తాను తయారుచేసిన ఆయుర్వేద ముందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని అన్నారు.
అయితే నేడు ప్రజలందరు మందు అడుగుతున్నారని, ఇప్పుడు ఉండే వసతులతో ఎక్కువ మోతాదు లో తయారు చేయలేఖపోతున్నామని, అందుకే అందుబాటులో ఉన్న సాంకేతిక తో పెద్ద ఎత్తు లో మందు తయారుచేసి అందరికి ఇవ్వనున్నట్లు తెలిపారు.
రెవెన్యూ, విద్యుత్ శాఖ నుంచి కొన్ని అనుమతులు ఇప్పించవలసిందిగా మంత్రి బాలినేని ని ఆనందయ్య కోరారు.
స్పందించిన మంత్రి బాలినేని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుని పిలిచి మాట్లాడారు.ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పుడు ఎందుకు జాప్యం చేస్తున్నారని అడిగారు.
ప్రజలు ఎక్కువ ఆనందయ్య మందు కోరుకుంటున్నారని అందుకు తగ్గ సహకారం తయారీదారులకు అందించాల్సిన బాధ్యత మనమీద ఉందన్నారు.
తక్షణమే అనుమతులు ఇవ్వాలిసిందిగా కలెక్టర్ , విద్యుత్ శాఖా అధికారులను మంత్రి బాలినేని ఆదేశించారు.
ఆనందయ్య మంత్రికి, ధన్యవాదములు తెలిపారు.