నిరుపేద మహిళల ఆర్థికాభివృద్ది వై.యస్.ఆర్ చేయూతతోనే : గోతం బాలకృష్ణ

4
Spread the love

నిరుపేద మహిళల ఆర్థికాభివృద్ది వై.యస్.ఆర్ చేయూతతోనే : గోతం బాలకృష్ణ

-: నెల్లూరు, ఆగస్టు 12 (స‌దా మీకోసం) :-

నగరంలోని 11వ డివిజన్ సచివాలయం ఆధ్వర్యంలో వై.యస్.ఆర్ చేయూత పథకాన్ని ఆర్ఓపి శ్రీనివాసులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా 11వ డివిజ‌న్ వైకాపా ఇన్చార్జ్ గోతం బాలకృష్ణ మాట్లాడుతూ నిరుపేద మ‌హిళ‌ల ఆర్ధికాభివృద్ధి వై.ఎస్‌.ఆర్ చేయూత ప‌థ‌కం‌తోనే సాధ్య‌మ‌న్నారు.

మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు 11డివిజన్ లో 367 మంది లబ్దిదారులకు

అందజేస్తున్నామని ఇంకా ఈ పథకానికి అర్హులైన వారు ఉంటే ఈ నెల చివరి లోపల వాలంటైర్లు ద్వారా అప్లై చేసుకోవాలని అన్నారు.

మహిళల సంక్షేమ పథకాల వంటి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కి 11వ డివిజన్ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

అనంతంర శ్రీనివాసులు, వెల్ఫేర్ జి మల్లికార్జున్ త‌దిత‌రులు మాట్లాడుతూ… ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ నవరత్నల బాగంలో 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు వై.యస్.ఆర్ చేయూత పథకం కింద రూ.18,750/-లను అందించి వారికి అండగా నిలిచారని తెలిపారు.

నాలుగేళ్లలో రూ.75,000/-లను ప్రతి మహిళకు అందించనున్నట్లు చెప్పారు.

ప్రతి నెల సామాజిక పెన్షన్లు పొందుతున్న 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్ల లోపు దివ్యాంగుల,వితంతువులకు వై.యస్.ఆర్ చేయూత పథకాన్ని వర్తింప చేశారని అన్నారు.

కార్యక్రమంలో డివిజన్ ఇంచార్జ్ లు గోతం బాలకృష్ణ, పొడమేకల శ్రీనివాసులు, వైసీపీ నేతలు, పి సాకేశ్ రెడ్డి, సిహెచ్ నాగరాజు, ఆవుల శ్రీనివాసులు, సచివాలయం సిబ్బంది ఐ రఘునాథ, విష్ణు, సిహెచ్ శ్రీనివాస్, వాలంటైర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!