రేపు ప్రమాణం చేయనున్న కొత్త మంత్రి వర్గం….. అంసంతృప్తి వ్యక్తం చేస్తున్న పలువురు ఆశావహులు…!
The new cabinet will be sworn in tomorrow
రేపు ప్రమాణం చేయనున్న కొత్త మంత్రి వర్గం
అంసంతృప్తి వ్యక్తం చేస్తున్న పలువురు ఆశావహులు
అమరావతి, ఏప్రిల్ 20 (సదా మీకోసం) :
ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రులు ఎవరనేది ఎట్టకేలకు నిర్ణయం బయటకొచ్చింది.
గత కొన్ని రోజులుగు ఏర్పడిన ఉత్కంఠకు తెరదీస్తు నేటి సాయంత్రానికి తుది జాబితా విడుదలైంది.
ఉదయం నుండి సాయంత్రం వరకు లీకైన వివరాల మేరకు మంత్రి పదవి వచ్చిన వారు ఆనందం వ్యక్తం చేయగా పదవి రాని ఆశావహులలో నిరాశ, నిసృహలు కనిపించాయి.
నెల్లూరు జిల్లా విషయానికి వస్తే, సర్వేలపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆశావహులుగా ఉండగా కాకాణి గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి వరించింది.
గత కొంత కాలంగా కాకాణి గోవర్ధన్ రెడ్డికి (Kakani Govardhan Reddy మంత్రి పదవి ఖాయంగా పలువురు రాజకీయ విశ్లేషకు చెబుతుండడం తెలిసిందే.
గతంలో జిల్లా మంత్రులుగా ఉన్న పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ మంత్రి పదవి దూరం కాగా, మరో మంత్రి మేకపాటి గౌతంరెడ్డి (Mekapati Gowtham Reddy) మరణంతో ఆయన స్థానంలో ఆయన సతామణి కి ఇవ్వవచ్చు అన్న ఊహాగానాలు లేచినా జూన్, జూలైలలో ఆత్మకూరు నియోజయక వర్గానికి ఎన్నికలు వస్తాయని అక్కడ గౌతం రెడ్డి సోదరుడు పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
ఇక నెల్లూరు రూరల్ విషయానికి వస్తే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotam Reddy Sridhar Reddy) విలేఖరులతో మాట్లాడుతూ, వై.ఎస్. రాజా రెడ్డిని జిల్లాకు తీసుకు వచ్చిన వారిలో తానున్నానని, వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర సమయంలో పాల్గొన్న వారిలో తాను ఉన్నానని, వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో జిల్లాలో తాను తన బుజస్కందాలపై వేసుకొని పని చేసినట్లు గుర్తు చేశారు.
ఏది ఏమైనా జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) నిర్ణయానికి కట్టుబడి పని చేస్తానని చెప్పుకొచ్చారు.
కాని ఆయన అనుచరులు తమ పార్టీ పదవులకు , కార్పొరేటర్లుగా, యంపిటిసిలుగా, జడ్‌పిటిసిలుగా రాజీనామా చేస్తామని ఎమ్మెల్యే ముందే ప్రకటించడం గమనార్హం. కోటం రెడ్డికి మంత్రి పదవి ఇచ్చే వరకు నిరసనలు కొనసాగుతాయని అనుచరలు ప్రకటిస్తున్నారు.
వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కన్నీటి పర్యంతం
కేబినెట్ పదవులు వైసీపీ ఆశావహుల్లో భావోద్వేగాన్ని కలిగిస్తున్నాయి. కొత్త కేబినేట్లో పదవి దక్కుతుందని గంపెడు ఆశలు పెట్టుకున్న నేతలకు మంత్రుల లిస్టు కన్నీటిని తెప్పిస్తోంది.
తమకు పదవి రాకుండా పోతోందనే ఆవేదన కళ్ల నుంచి నీటి రూపంలో ఒక్కసారిగా బయటకు వస్తోంది.
పండగ పూట నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు.
లిస్టులో తన పేరు లేదని భావోద్వేగం వ్యక్తం చేశారు. తనకు మంత్రి పదవి దక్కడంలేదని వాపోయారు.
అయినా సీఎం జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. పార్టీ గెలుపు కోసం కృష్టి చేస్తానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు.
మంత్రి వర్గ కూర్పుపై అసంతృప్తి
మంత్రివర్గ కూర్పుపై కృష్ణా జిల్లా వైసీపీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
రాజకీయాలకు కేంద్ర బిందువైన కృష్ణా జిల్లాకు అన్యాయం జరిగిందని నేతలు వాపోతున్నారు.
పెడన నియోజకవర్గానికి చెందని జోగి రమేష్‌కు మంత్రి పదవి ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లాలో మంత్రి పదవి ఊసేలేదు.
దీంతో ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీ నేతలు, కార్యకర్తలు డీలా పడిపడ్డారు.
గుంటూరు జిల్లా మాచర్లలో వైసీపీ ప్రజాప్రతినిధుల రాస్తారోకో చేశారు. మున్సిపల్ చైర్మన్ కిశోర్ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించారు.
ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. మంత్రి పదవి ఇవ్వకపోతే మూకుమ్మడి రాజీనామా చేస్తామని హెచ్చరిస్తున్నారు.
25 మందితో మంత్రి వర్గం కూర్పు
ఆంధ్రప్రదేశ్ కొత్త కేబినెట్ ఖరారైంది. 25 మందితో కొత్త మంత్రివర్గ జాబితా విడుదలైంది.
కేబినెట్ పైనల్ లిస్టు..
- గుడివాడ అమర్నాథ్
- దాడిశెట్టి రాజా
- బొత్స సత్యనారాయణ
- రాజన్నదొర
- ధర్మాన ప్రసాదరావు
- సీదిరి అప్పలరాజు
- జోగి రమేష్
- అంబటి రాంబాబు
- కొట్టు సత్యనారాయణ
- తానేటి వనిత
- కారుమూరి నాగేశ్వరరావు
- మేరుగ నాగార్జున
- బూడి ముత్యాలనాయుడు
- విడదల రజిని
- కాకాణి గోవర్ధన్‌రెడ్డి
- అంజాద్ భాష
- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
- బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
- పినిపె విశ్వరూప్
- గుమ్మనూరు జయరాం
- ఆర్కే రోజా
- ఉషశ్రీ చరణ్
- ఆదిమూలపు సురేష్
- చెల్లుబోయిన వేణుగోపాల్
- నారాయణస్వామి
- చీఫ్ విప్‌గా ప్రసాదరాజు
- డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల వీరభద్రస్వామి
- ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్‌గా మల్లాది విష్ణు