యూట్యూబ్ ఛానల్ ప్లాన్ చేస్తున్న స్టార్ హీరోయిన్

కమల్ హాసన్ కూతురిగా శృతి హాసన్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదట్లో టెక్నికల్ యూనిట్ తో కలిసి పనిచేసిన శృతి ఆ తరువాత హీరోయిన్ గా ప్రమోట్ అయ్యింది. టెక్నిషియన్ గా రాణిస్తూనే హీరోయిన్ గా మెప్పించింది. తమిళంతో పాటుగా తెలుగులో అనేక సినిమాలు చేసింది శృతి హాసన్. అయితే, వరసగా సినిమాలు చేస్తున్న సమయంలో సడెన్ గా బ్రేక్ ఇచ్చి ఇండస్ట్రీకి దూరమైనా శృతి హాసన్ తిరిగి మాస్ మహారాజా రవితేజ సినిమా క్రాక్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. కాగా శృతి నటిగా మాత్రమే కాదు.. ఓ గాయనిగా మ్యూజిక్ కంపోజర్ గా కూడా సుపరిచితమే. అయితే ఈ టాలెంటెడ్ భామ.. త్వరలోనే ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభం చేయనుందట. ఇప్పటి వరకు శృతి యూకెలో అంతటా మ్యూజికల్ ప్రదర్శనలు ఇచ్చింది. అయితే తన మ్యూజిక్ టూర్లను ఇండియన్స్ మిస్ అయ్యారు.ఈ సందర్భంగా శృతి మాట్లాడుతూ.. “నేను సోషల్ మీడియాలో అభిమానులతో సరదాగా మాట్లాడాను. త్వరలోనే ఓ యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి అభిమానులకు మరింత దగ్గర అవ్వాలని ఆలోచిస్తున్నా” అని తెలిపింది. ఇక యూట్యూబ్ ఛానల్ కంటెంట్ గురించి మాట్లాడుతూ.. “ఈ ఛానల్లో ఇకపై నా సొంత ట్రాక్స్ అప్లోడ్ చేస్తాను. బిటిఎస్ ఫుటేజ్ తో పాటు నా ప్రదర్శనలు.. మ్యూజికల్ టూర్ల అన్నీ వీడియోలు అందులోనే ఉంటాయి” అని చెప్పుకొచ్చింది శృతి.