అభూత కల్పనల విషం చిమ్మే జంట కాలకూట విష సర్పాలు

0
Spread the love

అభూత కల్పనల విషం చిమ్మే జంట కాలకూట విష సర్పాలు

  • విజయ సాయి రెడ్డి, దేవేంద్ర రెడ్డి లే నేతృత్వం
  • నాదమూరి ఆడపడుచులు, నారా కుటుంబమే లక్ష్యం
  • వైసీపీ సోషల్ మీడియా బరి తెగించి విషప్రచారం
  • కాకర్ల తిరుమల నాయుడు, షేక్ అమ్రుల్లా, పనబాక భూ లక్ష్మి

నెల్లూరు ప్ర‌తినిధి, ఆగ‌ష్టు 4 (స‌దా మీకోసం) : 

మాజీ ముఖ్యమంత్రివర్యులు, దివంగత నందమూరి తారక రామారావు గారి నాలుగవ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి గారి మరణం పై అభూత కల్పనలను సృష్టించి సోషల్ మీడియా లో దుష్ప్రచారం చేస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, విజయ సాయి రెడ్డి ల పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ నెల్లూరు నగరంలోని చిన్న బజార్ పోలీస్ స్టేషన్ నందు తెలుగుయువత, టీఎన్ఎస్ఎఫ్, తెలుగు మహిళ విభాగ పార్లమెంట్ అధ్యక్షులు కాకర్ల తిరుమల నాయుడు, షేక్ అమ్రుల్లా, పనబాక భూ లక్ష్మి ల ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా కాకర్ల తిరుమల నాయుడు, షేక్ అమ్రుల్లా, పనబాక భూ లక్ష్మి లు మాట్లాడుతూ, అనారోగ్య కారణాలతో మృతి చెందిన కంఠమనేని ఉమామహేశ్వరి గారి సాధారణ మరణాన్ని నారా వారి కుటుంబానికి ఆపాదిస్తూ, విజయ సాయి రెడ్డి, దేవేందర్ రెడ్డి లు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు వైసీపీ రాజకీయ దిగజారుడుతనానికి పరాకాష్ట అని పేర్కొన్నారు.

నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడుల‌ను లక్ష్యంగా చేసుకుని గుర్రంపాటి దేవేంద్ర రెడ్డి నేతృత్వం లో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు విష ప్రచారాలకు తెగ బడుతున్నారన్నారు.

విజయసాయిరెడ్డి, దేవేందర్ రెడ్డి చెబుతున్న సర్వే నెంబర్లలో ఎలాంటి భూములు లేవని తెలంగాణ ప్రభుత్వం తేల్చడంతో ఉమా మహేశ్వరి గారి మరణం పై వైసిపి నేతల దుష్ప్రచారం, కుట్రలు బహిర్గతమయ్యాయని తెలిపారు.

కుటుంబ సభ్యులను కోల్పోయి విషణ్ణవదనం లో ఉన్న నారా, నందమూరి కుటుంబాలపై వైసీపీ సోషల్ మీడియా విషం చిమ్ము తోంది. ఈ విష ప్రచారాలను వైసీపీ నేతలు ప్రోత్సహించడం సిగ్గుచేటు అన్నారు. 

నారా భువనేశ్వరిని వైసీపీ ఎమ్మెల్యే లు, వైసీపీ నేతలు అసెంబ్లీ సాక్షిగా అవమానించిన ఘటన ను రాష్ట్ర ప్రజలు మరవక ముందే ఉమా మహేశ్వరి గారి మరణం పై దుష్ప్రచారం మొదలెట్టారన్నారు.

నందమూరి తారక రామారావు గారి కుమార్తెలను, వారింటి ఆడపడుచులనే లక్ష్యం గా చేసుకుని వైసీపీ సోషల్ మీడియా నేతలు విష ప్రచారం చేస్తున్నారన్న అనుమానం కలుగుతోందన్నారు.

ఉమా మహేశ్వరి గారి మరణం అనుమానస్పదంగా ఉందని సీబీఐ దర్యాప్తు కావాలని విజయ సాయి రెడ్డి దుష్ప్రచారం కు తెర తీశారు. బురద చల్లేస్తాం… తీరిగ్గా కడుక్కోండి అన్న చందంగా వైసీపీ నేతల తీరు ఉందని విమ‌ర్శించారు.

ఉమా మహేశ్వరి గారి సాధారణ మరణం పై సీబీఐ దర్యాప్తు కోరుతున్న విజయ సాయి రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు.

గొడ్డలి పోట్లకు బలై మరణించిన వైయస్ వివేకానంద రెడ్డి గారికి కుట్లు వేసి, దానిని గుండె పోటని విజయ సాయి రెడ్డి ప్రచారం చేశారు… వైఎస్ వివేకానంద రెడ్డి గారిది కదా అనుమానాస్పద మృతి అంటే అని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. 

సోషల్ మీడియా వేదికగా అబద్ధాలు, అభూత కల్పనలు, విష ప్రచారాల తో రాష్ట్ర ప్రజలను పక్క దారి పట్టించే ప్రయత్నం చేస్తున్న విజయ సాయి రెడ్డి ,దేవేందర్ రెడ్డి లు విష సర్పాల కన్నా ప్రమాదకరం అన్నారు.

టిడిపి నేతలు, కార్యకర్తల పోస్టులపై వచ్చే ఫిర్యాదు లను ఆఘమేఘాల పై అందుకుని, పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిప్పి వేధించే పోలీసులు వైసీపీ నేతలు బరి తెగించి దుష్ప్రచారం చేస్తుంటే కనీస చలనం ఎందుకు లేదు ? టిడిపి నేతల ఫిర్యాదులపై పోలీసులు ఎందుకు స్పందించడం లేదని ప్ర‌శ్నించారు.

ఉమా మహేశ్వరి గారి మరణం పై దుష్ప్రచారం చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలు విజయ సాయి రెడ్డి దేవేందర్ రెడ్డి లపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలకు సైతం వెనుకాడమని హెచ్చరించారు.

కార్యక్రమం లో తెలుగు మహిళలు కొమరి విజయమ్మ, కప్పిర రేవతి, పద్దమ్మ, శ్రీదేవి, సుశీలమ్మ, వనజమ్మ, ప్రమీలమ్మ, పద్మజ, మల్లిక, లత, అమ్ములు, తెలుగుయువత నాయకులు వేణు, అనిల్, నవీన్, సంతోష్, రఫీ, టి.ఎన్‌.ఎస్‌.ఎఫ్‌ నేతలు షేక్.వసీం, రమేష్, నరేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!