డివిజన్ లో వెలుగులు నింపుతున్న హజరత్ నాయుడు
డివిజన్ లో వెలుగులు నింపుతున్న హజరత్ నాయుడు
-: నెల్లూరు రూరల్, ఆగస్టు 8 (సదా మీకోసం) :-
డివిజన్ పరిధిలో ప్రజలకు ఏ సమయంలో ఏ సమస్య వచ్చినా నేను ఉన్నాను అంటూ ముందు వచ్చి సమస్యలను పరిష్కరిస్తూ 34వ డివిజన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కరణం హజరత్ నాయుడు అందరి మన్ననలు పొందుతున్నారు.
డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో వీధిలైట్లు వెలగక ప్రజలు ఇబ్బంది పడుతుండడంతో వెంటనే సిబ్బందిచే వాటిని వెలిగేలా చేయించారు.
మున్సిపల్ నీటి పైప్ లైన్లు దెబ్బతినడంతో వాటిని వెంటనే సంబంధిత సిబ్బంది చేత మరమ్మతులు చేయించారు.
నీటి పైప్ లైన్లు మరమ్మతులకు గురికావడంతో ప్రజలు నీళ్ళకు ఇబ్బంది పడకుండా వాటర్ ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేశారు.
ఈ సందర్భంగా హజరత్ నాయుడు మాట్లాడుతూ కోటంరెడ్డి బ్రదర్స్ ఆదేశాల ప్రకారం డివిజన్ లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు.
వారు అందిస్తున్న సహాయ సహకారాలతో డివిజన్ లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు.
ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, కోటంరెడ్డి సోదరులను ప్రజలు ఆశీర్వదించాలని హజరత్ నాయుడు విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో అశోక్ దాసు, నారాయణ, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.