మీరు తలుచుకుంటే ప్రభుత్వాలు మారిపోతాయి
మీరు తలుచుకుంటే ప్రభుత్వాలు మారిపోతాయి
వైసిపి అరాచకాలపై దళితులు తిరగబడాల్సిన సమయం ఆసన్నమైంది
ఈ నెల 19న నెల్లూరులో దళితుల ప్రతిఘటన
నెల్లూరులో చేసే దళితుల ప్రతిఘటన రాష్ట్రం మొత్తం చూడాలి
నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్
నెల్లూరు ప్రతినిధి, ఏప్రిల్ 7 (సదా మీకోసం) :
నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లాలోని తెలుగుదేశం పార్టీ ముఖ్య ఎస్సీ నేతలతో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ సమావేశం నిర్వహించారు.
సమావేశానికి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, దావా పెంచల్ రావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, గత మూడేళ్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన లో దళితుల సంక్షేమాన్ని నీరుగార్చారని అన్నారు.
గత మూడేళ్ల కాలంలో దళితులకు కేటాయించిన వేలాది కోట్ల రూపాయలను దారి మళ్లించారని తెలిపారు.
స్వయం ఉపాధి రుణాలు లేక దళితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు,
ఎస్సీ కార్పొరేషన్ ఐటిడిఎ తదితర కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎస్సీ ,ఎస్టీలకు కేటాయించిన నిధులు దారి మళ్లించే కూడదని అనేక నిబంధనలు ఉన్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాటిని ఉల్లంఘించారన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలపై జిల్లా వ్యాప్తంగా దళితులు తిరగ పడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
జగన్ పాలనలో దళితులకు పేరుకే పదవులు,పెత్తనం మాత్రం వేరేవాళ్ళది : చేజర్ల
నెల్లూరు పార్లమెంట్ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో దళితులకు మంచి అంటూ జరిగింది అంటే అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్న సమయములోనేనని తెలిపారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దళితులకు ఉన్నత పదవులు ఇవ్వడమే కాకుండా వారు స్వేచ్ఛగా పని చేసే అవకాశం కల్పించింది.
అదే వైసీపీ ప్రభుత్వంలో దళితులకు పేరుకు మాత్రం పదవులు ఇచ్చి,వారిని ఉచ్చవ విగ్రహాలుగా మార్చి పెత్తనం మాత్రం వేరే వాళ్ళు వారి చేతుల్లో పెట్టిందన్నారు.
దళితుల పిల్లలు విదేశాల్లో చదువుకునేందుకు విదేశీ విద్యా పథకాన్ని చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టి, ఒక్కొక్కరికి రూ.15 లక్షలు ఆర్థిక సహాయం చేస్తే,జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయిన తరువాత ఈ పథకాన్ని నిలిపివేశారన్నారు.
దళిత ప్రతిఘటనకు వేలాదిగా తరలి రండి : కోటంరెడ్డి
నెల్లూరు నగర నియోజకవర్గ ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ, దళితులు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో దళితులకు చేపట్టిన సంక్షేమలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని, వాటిని ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తున్నారని అన్నారు.
దళితులపై వైకాపా ప్రభుత్వ తీరును నిరసిస్తూ అబ్దుల్ అజీజ్ గారి నాయకత్వంలో దళితుల ప్రతిఘటన నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ నెల 19న డాక్టర్ జెట్టి శేషారెడ్డి భవన్ లో నిర్వహిస్తున్న దళితుల ప్రతిఘటనకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వేలాది మంది తరలి రావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో కాకి ప్రసాద్, విజయ్ బాబు, శైలేంద్ర బాబు, మాతంగి కృష్ణా, వేగురి చంద్రశేఖర్, మోషే, కువ్వారపు బాలాజీ, ఆనంద్, ఇజ్రాయేల్, మారుతి, తదితర ఎస్సీ నాయకులు భారీగా పాల్గొన్నారు.