ఆగష్టు 15న పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ: జగన్
ఆగస్టు 15న పేదలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే.. టీడీపీ నేతలు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటున్నారన్నారు. వారి వల్ల సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. కోర్టు కేసులకు సంబంధించి అడ్డంకులన్నీ తొలగిపోతే భారత స్వాతంత్ర దినోత్సవం రోజున 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని జగన్ స్పష్టంచేశారు. ఈ ఏడాది రాష్ట్రంలో 20 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జగన్ ప్రకటించారు.