కుల,లింగ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన తొలితరం సామాజిక విప్లవ కారుడు మహాత్మా పూలే : చేజర్ల
కుల,లింగ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన తొలితరం సామాజిక విప్లవ కారుడు మహాత్మా పూలే
నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి
- బలహీన వర్గాలు,ఆర్ధికంగా రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందలనే పూలే గారి ఆశయాలను అమలు చేసిన మొదటి వ్యకి ఎన్టీఆర్
కోవూరు, నవంబర్ 29 (సదా మీకోసం) :
మహాత్మా జ్యోతిరావు పూలే గారి 131 వ వర్ధంతి సందర్భంగా కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఆయన చిత్ర పఠానికి పూలమాలలు వేసి నివాళులర్పించడము జరిగింది.
ఈ సందర్భంగా చేజర్ల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ, భారతదేశం లో కుల,లింగ వ్యవస్థల కు వ్యతిరేకంగా పోరాటం చేసిన మొట్ట మొదట వ్యకి మహాత్మ జ్యోతిరావు పూలే గారు అని తెలిపారు.
కులం పేరుతో తరతరాలుగా అడుగడుగునా అణిచివేతకు గురవుతున్న బడుగు,బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలిచి వారి హక్కుల కొరకు రాజీ లేని పోరాటం చేసి మహాత్మా అని బిరుదు పొందిన మొట్ట మొదటి వ్యక్తి పూలే గారు అన్నారు.
అందరికి చదువు ఎంతో అవసరమని గుర్తించి పాఠశాలలు ఏర్పాటు చేయడమే కాకుండా,తన భార్యను ఉపాధ్యాయురాలుగా నియమించి విద్యా బోధన చేయించారన్నారు.
డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ గారు, తన మొదటి గురువు మహాత్మ జ్యోతిరావు పూలే గారు అని చెప్పారంటే ఆయన అణగారిన వర్గాలు కొరకు ఎంత పోరాటం చేశారో అర్ధమవుతుందని తెలిపారు.
బలహీన వర్గాలు ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా అబివృది చెందలనే పూలే గారి ఆశయాలను అమలు చేసి చూపించిన మొదటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారని గుర్తు చేశారు.
దేశంలోనే మొట్టమొదటి సారిగా స్థానిక సంస్థలలో బీసీ లకు రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా అనేకమంది బీసీ లకు అత్యున్నత పదవులు ఇచ్చి ఎన్టీఆర్ గారు పూలే గారి ఆశయాలను అమలు చేసి చూపించారన్నారు.
నేడు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు అణిచివేతకు గురవుతున్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రాధాన్యత కలిగిన పదవులు అగ్ర వర్ణాలకు ఇచ్చి,ప్రాధాన్యత లేని పదవులు మాత్రం బలహీన వర్గాలకు ఇస్తున్నారని పేర్కొన్నారు.
మహాత్మ జ్యోతిరావు పూలే గారి 131 వ వర్ధంతి సందర్భంగా ఆయన చేసిన సేవలు గుర్తుచేసుకుంటూ వారి ఆశయ సాధనకు అందరం కంఖన బద్ధులమవుదామని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పంతంగి రామారావు, జొన్నదుల రవికుమార్,ఇంటూరు విజయ్,మెంటా సంపత్, నల్లమారి ఆంజనేయులు, మునగపాటి యువకుమార్, గరికిపాటి అనిల్ తదితరులు పాల్గొన్నారు.