30వ డివిజన్‌లో జగనన్న మాట – కార్యకర్తల ఇళ్ళకి కోటంరెడ్డి బాట
30వ డివిజన్‌లో జగనన్న మాట – కార్యకర్తల ఇళ్ళకి కోటంరెడ్డి బాట
నెల్లూరు రూరల్, ఫిబ్రవరి 26 (సదా మీకోసం) :
63వ రోజు జగనన్న మాట – కార్యకర్తల ఇళ్ళకి కోటంరెడ్డి బాట కార్యక్రమం నెల్లూరు రూరల్ పరిధిలోని 30 డివిజన్ లో ఉదయం 7 గంటలకు విజయమ్మ అనే కార్యకర్త ఇంటి నుండి మొదలైంది.
శ్రామికనగర్లో ప్రతీ కార్యకర్తతో, ప్రతీ నాయకునితో వారి ఇంటిలోనే ఏకాంతంగా మాట్లాడుతూ, ఒక కార్యకర్త ఇంటి నుండి మరో కార్యకర్త ఇంటికి వెళ్లే మార్గమధ్యలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్థానిక ప్రజలతో మాట్లాడుతూ, వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ, సంక్షేమ పథకాలగురించి ఆరాతీస్తూ ముందుకు సాగారు.
కార్యక్రమంలో 30వ డివిజన్ కార్పొరేటర్ కూకాటి ప్రసాద్, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.