స్పందనలో పాల్గొన్న చైర్ పర్సన్
స్పందనలో పాల్గొన్న చైర్ పర్సన్
బుచ్చిరెడ్డి పాళెం, మార్చి 21 (సదా మీకోసం) :
బుచ్చిరెడ్డి పాళెం నగర పంచాయితీ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజామురళీ పాల్గొని పలు అర్జీ లను స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు.
ఈ సందర్భగా ఛైర్ పర్సన్ మాట్లాడుతూ.. స్పందనలో నేడు వచ్చిన పెన్షన్లు, ఇళ్ళు స్థలాలు సంబంధించిన అర్జీలను అధికారులతో మాట్లాడి పరిష్కరించినట్లు తెలి పారు.
బైపాస్ రోడ్డుకి ఇరువైపుల, రెయన్ బో స్కూలు ప్రక్కన సైడు కాలువలు నిర్మాణం చేపట్టాలని అక్కడి మహిళలు విజ్ఞప్తిని కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తో మాట్లాడి పరిష్కరిస్తానని తెలిపారు.
కార్యక్రమంలో కౌన్సిలర్లు షకీలా బేగం, సత్యనారాయణ,ప్రజలు పాల్గొన్నారు.