రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు బాగుపడాలంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలి
- ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఏకైక ఆశా కిరణం నారా చంద్రబాబు నాయుడు
- ఆంధ్ర రాష్ట్రాన్ని నేటి సంక్షోభం నుంచి కాపాడగల ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు
- నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్
నెల్లూరు ప్రతినిధి, ఏప్రిల్ 20 (సదా మీకోసం) :
నెల్లూరు నగరంలోని ఎన్టీఆర్ భవన్లో బుధవారం టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 72వ జన్మదినాన్ని పురస్కరించుకొని టిడిపి అధ్యక్షులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
టిడిపి నేతలు కార్యకర్తలు పరస్పరం కేకును తినిపించుకున్నారు. 2024 సీఎం చంద్రబాబు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పండుగ వాతావరణంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడుతూ, ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు పండగ వాతావరణంలో చేసుకోవడం జరిగిందని అన్నారు.
నారా చంద్రబాబునాయుడు గారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ భగవంతుడు ఆయనకు ఇచ్చిన శక్తిని అనువాడు నా ప్రజల కోసం ఉపయోగిస్తారని నమ్ముతున్నానని అన్నారు.
రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు బాగుపడాలంటే రాష్ట్రం కష్టాల్లో నుంచి బయటకు రావాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
ఆయన తిరిగి ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర వ్యాప్తంగా సర్వమత ప్రార్థనలు నిర్వహిస్తున్నామని, ఈ రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి కాపాడగల ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని తెలిపారు.
నేటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఏకైక ఆశాకిరణం నారా చంద్రబాబు నాయుడని కొనియాడారు.
ఆంధ్ర రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకురావడానికి, కృషిచేసి శ్రమించడానికి భగవంతుడు ఆయనకు పూర్తి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నానన్నారు.
కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణా రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ తాళ్ళపాక అనురాధ, ధర్మవరపు సుబ్బారావు, టీడీపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.