సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి : కలెక్టర్
సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి
సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను ఆదేశించిన కలెక్టర్
కొడవలూరు, ఫిబ్రవరి 1 (సదా మీకోసం) :
సచివాలయాల పరిధిలో ప్రతి నెల చివరి శుక్ర, శనివారాల్లో చేపడుతున్న సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తప్పనిసరిగా తమ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేపడుతున్న, చేపట్టనున్న సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు వివరించాలని జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు ఆదేశించారు.
మంగళవారం ఉదయం కొడవలూరు మండల పరిధిలోని కొడవలూరు, గుండాలమ్మపాలెం గ్రామ సచివాలయాలను కలెక్టర్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను సకాలంలో అందజేయడమే సిటిజన్ అవుట్ రీచ్ ప్రోగ్రాం ఉద్దేశమన్నారు.
ఈ కార్యక్రమంపై సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలమన్నారు.
ఓ టి ఎస్ రిజిస్ట్రేషన్ పత్రాలను లబ్ధిదారులకు త్వరగా అందించాలని, ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే వారికి ఓ టి ఎస్ ప్రయోజనాన్ని వివరించి వారు ముందుకొచ్చి ఈ పథకం కింద లబ్ధి పొందేలా వారిని ప్రోత్సహించాలన్నారు. బూస్టర్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.
సచివాలయం పరిధిలో దరఖాస్తులు పెండింగ్లో లేకుండా చూసుకోవాలని ఆదేశించారు.
కలెక్టర్ వెంట ఎంపీడీవో నరసింహారావు, తాసిల్దార్ రమాదేవి, ఈవో ఆర్ డి నాగరాజు, కొడవలూరు సచివాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.