ఉద్దేశపూర్వకంగా రిజెక్ట్ చేసినా బిఎల్ఓ లపై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తాం
ఉద్దేశపూర్వకంగా రిజెక్ట్ చేసినా బిఎల్ఓ లపై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తాం
మాజీ మంత్రి, పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
నెల్లూరు, అక్టోబర్ 31 (సదా మీకోసం):
నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం ఆత్మకూరు నియోజకవర్గ నాయకులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు ఆన్లైన్లో నమోదు చేసుకున్న ఆర్డిఓ ఆఫీసులో సబ్మిట్ చేసిన బిఎల్వోలు వచ్చి వెరిఫై చేయాలన్న రూల్ పెట్టారని ఒకవేళ ఒరిజినల్ సర్టిఫికెట్ చూపించిన ఓటర్ ఉండాలన్న రూల్ పెట్టారని వీటితో అధికార దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఓటర్ లేకపోయినా, ఇంట్లో వారు ఒరిజినల్ సర్టిఫికెట్ చూపితే ఓటును యాక్సెప్ట్ చేయాలని ఎలక్షన్ కమిషన్ ను కోరారు.
ఒరిజినల్ సర్టిఫికెట్లు చూపించిన వెరిఫికేషన్కు వెళ్లకుండానే వారు లేరని ఉద్దేశపూర్వకంగా రిజెక్ట్ చేసినా బిఎల్ఓ లపై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
గతంలో ఉన్న ఓటర్ లిస్టుకే చేర్పులు వచ్చేవని కానీ ఇప్పుడు పాత ఓటర్ లిస్ట్ ను పూర్తిగా రద్దు చేసి కొత్తది తయారు చేస్తున్నారని దీనిపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి అవకతవకులు లేకుండా ఓటర్ నమోదు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
బీద రవిచంద్ర మాట్లాడుతూ, నాయకులకు తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల గూర్చి ఓటరు వెరిఫికేషన్ గూర్చి ఓటర్ల మార్పులు చేర్పులు తొలగింపులు గూర్చి వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లు చేర్పించాలని, ఓటర్ వెరిఫికేషన్, సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలు పెట్టాలని సూచించారు.
అనంతరం తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ ను నియోజకవర్గ నాయకులకు పరిచయం చేశారు కంచర్ల శ్రీకాంత్ గెలుపుకు దోహదపడాలని కోరారు.
కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గం పరిశీలకులు రమణ, మాజీ జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాజీ శాసనసభ్యులు కొమ్మి లక్ష్మీ నాయుడు రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి గుటూరు మురళి కన్నబాబు, రాష్ట్ర కార్యదర్శి దావా పెంచలరావు తదితర జిల్లా కమిటీ నాయకులు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.