లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో కరోనా మహమ్మారి మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. ఇవాళ ఒక్కరోజే ఇక్కడ 2308 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. యూపీలో ఒకేరోజు ఇన్ని కరోనా కేసులు రావడం ఇదే తొలిసారి అని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 55,588కి చేరినట్టు వెల్లడించారు. కాగా గడచిన 24 గంటల్లో ఉత్తర ప్రదేశ్‌లో 34 మంది […]
Month: July 2020
భారత్‌లో పెట్టుబడులు పెట్టండి: మోదీ
న్యూఢిల్లీ: భారత్‌లో పెట్టుబడులు పెట్టాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా కంపెనీలకు ఆహ్వానం పలికారు. యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ నేతృత్వంలో జరిగిన ఇండియా ఐడియాస్ సదస్సును ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. బీమా రంగంలో వంద శాతం ఎఫ్‌డీఐకి అనుమతిచ్చామని మోదీ గుర్తు చేశారు. రక్షణ రంగంలోనూ అలాగే అంతరిక్ష రంగంలోనూ పెట్టుబడులు పెట్టాలని సూచించారు. రక్షణ రంగంలో ఏకంగా 74 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం […]
కోవిడ్ ఆస్ప్రత్రిలో కామపిశాచి.. ఒంటరి మహిళపై డాక్టర్.. దారుణం
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని సైతం లెక్కచేయడం లేదు కామాంధులు. కరోనా వైరస్ సోకి చికిత్స పొందుతున్న మహిళలపై అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. క్వారంటైన్ కేంద్రాల్లో ఒంటరిగా ఉంటున్న మహిళలపై కీచకులు రెచ్చిపోయి లైంగిక దాడులకు తెగబడుతున్నారు. కామంతో కళ్లుమూసుకుపోయిన కీచక డాక్టర్ కరోనా బాధిత మహిళపై లైంగిక దాడికి యత్నించిన అమానుష ఘటన తాజాగా వెలుగుచూసింది. యూపీలోని గజియాబాద్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. అలీగఢ్‌కి చెందిన మహిళ(28) గజియాబాద్‌లో నివాసముంటోంది. […]
జ్వరం ఉన్న అందరికీ కరోనా టెస్టులు చేయండి: ఈటల
వైద్య సిబ్బంది ప్రజల ప్రాణాలు కాపాడటానికి చాలా శ్రమిస్తున్నారని ఊపిరితిత్తులు, శ్వాసకోస సంబంధిత సమస్యలు ఉన్నవారికి కరోనా ఎక్కువ ప్రమాదకరంగా మారిందని ఈటల అన్నారు. కరోనా వ్యాప్తి కట్టడి చర్యలపై ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వైద్యాధికారులతో సమావేశం అయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. జ్వరం వచ్చిన ప్రతిఒక్కరిని వీలైనంత త్వరగా గుర్తించి పరీక్షలు చేయాలని సూచించారు. దీని ద్వారా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయినా ప్రాణనష్టం […]
విగ్రహాల ఏర్పాటు ఉద్దేశం ఇదే: ఉప రాష్ట్రపతి
న్యూఢిల్లీ: భారత దేశాభివృద్ధికి అవినీతి ఓ అవరోధంగా మారిందని.. దీన్ని దేశం నుంచి పారద్రోలేందుకు ప్రభుత్వంతోపాటు పౌరసమాజం, ప్రజలు సంయుక్తంగా పనిచేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఢిల్లీలోని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని బుధవారం ఆయన ఆవిష్కరించి ప్రసంగించారు. ‘రాజనీతిజ్ఞతతోపాటు సంఘ సంస్కర్తగా, తత్వవేత్తగా, మేధావిగా, న్యాయకోవిదుడిగా, ఆర్థికవేత్తగా, రచయితగా, మానవతా మూర్తిగా బహుముఖ ప్రజ్ఞ కలిగిన గొప్ప […]
భారీ సెక్స్ రాకెట్ నిర్వాహకురాలికి కఠిన శిక్ష
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోనే అత్యంత భారీ సెక్స్ రాకెట్ నిర్వాహకురాలికి స్థానిక కోర్టు 24 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. సోను పంజాబన్ అలియాస్ గీతా అరోరాగా గుర్తింపు పొందిన ఈ మహిళ ఢిల్లీలోనే అత్యంత భారీ సెక్స్ రాకెట్‌ను నిర్వహించినట్టు ఆమెపై వచ్చిన ఆరోపణలు రుజువయ్యాయని కోర్టు తెలిపింది. దాంతో ద్వారకా జిల్లా కోర్టు బుధవారం ఆమెకు 24 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఆమెతో […]
రంగుల ప్రపంచం వెనకున్న దారుణ నిజాలు
చిత్ర పరిశ్రమ అనేది ఓ మాయా ప్రపంచం. బయటినుంచి చూసేవాళ్లకి అదో రంగులలోకం. ఏమీ లేని స్థాయి నుంచి స్టార్లుగా ఎదిగిన వాళ్లు కొందరుంటే ఎక్కడినుంచి మొదలు పెట్టారో తిరిగి అక్కడికే చేరేవాళ్లు మరికొందరుంటారు. ఒక్క సినిమా హిట్ అయితే రాత్రికి రాత్రే స్టార్లు అయినవాళ్లు కూడా ఉన్నారు. అయితే ఈ క్రేజ్ ఎక్కువకాలం నిలవాలంటే మాత్రం కఠోర శ్రమ, గ్లామర్, అదృష్టం..ఇలా అన్నీ కలిసిరావాలి లేదంటే ఇండస్ట్రీలో నెగ్గుకురావడం చాలా కష్టం. […]
కరోనా రోగులతో కలెక్టర్ కాన్ఫరెన్స్
వివిధ క్వారంటైన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగులతో కలెక్టర్ చక్రధర్‌బాబు మంగళవారం రాత్రి మాట్లాడారు. నగరంలోని జెడ్పీ ఆవరణలో గల డీఈఓసీ కేంద్రం నుంచి జూమ్ యాప్ ద్వారా కలెక్టర్ రోగులతో మాట్లాడారు. ఆహార నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. వైద్య చికిత్స ఎలా అందుతోంది.. వైద్యులు అందుబాటులో ఉన్నారానని ప్రశ్నించి సమాధానాలు రాబట్టారు. వైద్యులు మెరుగైన చికిత్సను అందిస్తారని.. ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. రోజూ జూమ్ […]
ఏపీలో ఒక్క రోజే 6,045 కరోనా కేసులు.. 65 మరణాలు..
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 49,553 శాంపిల్స్ పరీక్షించగా.. అందులో 6,045 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 64,713కి చేరింది. ఇందులో 31,763 యాక్టివ్ కేసులు ఉండగా.. 32,127 మంది […]
ఆగష్టు 15న పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ: జగన్
ఆగస్టు 15న పేదలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే.. టీడీపీ నేతలు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటున్నారన్నారు. వారి వల్ల సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. కోర్టు కేసులకు సంబంధించి అడ్డంకులన్నీ తొలగిపోతే భారత స్వాతంత్ర దినోత్సవం రోజున 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని జగన్ స్పష్టంచేశారు. ఈ ఏడాది రాష్ట్రంలో […]

