ఖబడ్దార్ అంబటీ..! : టీడీపీ నేతలు..!!
ఖబడ్దార్ అంబటీ..!
-టీడీపీ నేతలు..!!
తోటపల్లిగూడూరు, నవంబర్ 20 (సదా మీకోసం) :
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిని అసభ్యకరంగా అవమానించిన వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే లు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శనివారం తోటపల్లిగూడూరు మండలం నరుకూరు సెంటర్ వద్ద ధర్నా చేశారు.
కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ కార్యదర్శి కొణతం రఘుబాబు, మండల ప్రధాన కార్యదర్శి ముత్యాల శ్రీనివాసులు, మన్నెం జితేంద్ర,యువత ప్రధాన కార్యదర్శి గంగపట్నం సుధీర్, చెవూరు శ్రీనివాసులు, నెల్లిపూడి సునీల్ రెడ్డి, ఆరికాటి వెంకటేష్, పునామల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భువనేశ్వరి ని దూషించిన వైసీపీ ఎమ్మెల్యేలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ముఖ్యంగా అంబటి రాంబాబు భువనేశ్వరికి తక్షణమే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
ఇటువంటి ఘటనలు పునరావృతమైతే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు లుచ్చా అంబటి రాంబాబు, లుచ్చా కొడాలి నాని, లుచ్చా చంద్రశేఖర్ రెడ్డి అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. అంతేకాక డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి అంటూ నినదించారు. ధర్నా లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.