నూతన మండలాధ్యక్షుడుగా కొండూరు బాబురావు

నూతన మండలాధ్యక్షుడుగా కొండూరు బాబురావు
విడవలూరు, మార్చి 07 (సదా మీకోసం)
అఖిల భారత హిందూ మహాసభ పార్టీ విడవలూరు మండలానికి నూతన మందలాధ్యక్షుడుగా కొండూరు బాబురావు ఎంపికయ్యాడని పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ రోజు విడవలూరు మండలం రామతీర్థం గ్రామం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవస్థానం వద్ద జరిగిన హిందూ బంధువుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ 90 సంవత్సరాల చరిత్ర కలిగిన అఖిల భారత హిందూ మహాసభ పార్టీకి నెల్లూరు జిల్లాలోని 46 మండలాల్లో మండలాధ్యక్షుల ఎంపిక జరుగుతున్నదని, ఆ క్రమంలో విడవలూరు మండలంలోని అన్నీ గ్రామాల్లో హిందూ కార్యక్రమాలను నిర్వహిస్తున ఊటుకూరు పెద్దపాలెం నివాసి కొండూరు బాబురావును మండలాధ్యక్షుడుగా జిల్లా కమిటీ ఎంపిక చేసిందన్నారు.
మండలంలోని హిందువులందరూ హిందూ మహాసభ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. త్వరలోనే అధికారికంగా పార్టీ సమావేశం నిర్వహించి, విడవలూరు మండలానికి పూర్తి మండల కార్యవర్గకమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటన చేశారు.