ఆర్డీవో కార్యాల‌యం రాజముద్ర కొత్త‌ది తయారు చేయించండి : ఏపిఈజేయూ

0
Spread the love

ఆర్డీవో కార్యాల‌యం రాజముద్ర కొత్త‌ది తయారు చేయించండి

నెల్లూరు ఆర్డీవోని కోరిన ఏపిఈజేయూ

నెల్లూరు ప్ర‌తినిధి జూలై 11 (స‌దా మీకోసం) :

నూతనంగా పత్రికలు తీసుకు వచ్చేందుకు ఆర్డీవో కార్యాలయం ద్వారా ఆర్‌.ఎన్‌.ఐ. న్యూ ఢిల్లీ కార్యాలయం వారికి ‘టైటిల్‌ వెరిఫికేషన్‌ లెటర్‌’, ‘డిక్లరేషన్‌ (ఫాం-1,ఫాం-2)’ వంటి పత్రాలను పంపడం జరుగుతుంది.

ఆ పత్రాలలో రెవెన్యూ డివిజనల్‌ అధికారి మరియు సబ్‌ డివిజినల్‌ మెజిస్ట్రేట్ అధికారిక సీల్‌ / రాజముద్ర (రౌండ్‌ స్టాంప్‌) సరిగా కనిపించకపోవడంతో సరైన విధంగా స్టాంప్‌ వేసి పంపాలని పత్రాల‌ను ఆర్‌.ఎన్‌.ఐ కార్యాలయం వారు తిప్పి పంపుతున్న కారణంగా పత్రికా ఎడిటర్లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆంధ్ర‌ప‌దేశ్ ఎడిట‌ర్స్ & జ‌ర్న‌లిస్ట్స్ యూనియ‌న్ నేతలు ఆర్డీవో పి. కొండ‌య్య దృష్టికి తీసుకు వెళ్లింది.

స్టాంపు వేసిన తర్వాత దాని యొక్క ముద్ర స‌రిగా లేని కారణంగా నూతనంగా పత్రికలు తీసుకురావడంలో, పాత పత్రికలలో మార్పులు చేసుకోవడంలో పత్రికా ఎడిటర్లుగా ఇబ్బందులు పడుతున్నామని, కావున ఎడిట‌ర్ల‌ ఇబ్బందిని గుర్తించి ఆర్డీవో అధికారిక సీల్‌ / నూతన రాజముద్ర (రౌండ్‌ స్టాంప్‌) ను కొత్తది తయారు చేయించాలని ఆర్డీవో పి.కొండ‌య్య‌ని కోరారు.

ఏపీఈజేయూ నాయ‌కులు చెప్పిన విష‌యాన్ని విని సానుకూలంగా స్పందిచిన ఆర్డీఓ మాట్లాడుతూ ఆర్టీవో కార్యాలయ రాజముద్ర సరిగ్గా పడటం లేదనే కారణంగా ఎడిటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే విధంగా ఆర్టిఓ కార్యాలయానికి సంబంధించిన కొత్త రాజముద్రను తయారు చేసే విధంగా త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని apeju నాయకులకు హామీ ఇచ్చారు.

కార్య‌క్ర‌మంలో ఏపీఈజేయూ రాష్ట్ర కో-క‌న్వీన‌ర్ గ‌ట్టుప‌ల్లి శివ‌కుమార్, నెల్లూరు జిల్లా అద్య‌క్షులు ఉడ‌తా రామ‌కృష్ణ‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పిగిలం నాగేంద్ర యాదవ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!