స్వాతంత్ర స్పూర్తిని ప్రతి ఒక్కరూ పుణికిపుచ్చుకోవాలి : నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి

Spread the love

స్వాతంత్ర స్పూర్తిని ప్రతి ఒక్కరూ పుణికిపుచ్చుకోవాలి

నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి

నెల్లూరు, ఆగ‌ష్టు 7 (స‌దా మీకోసం) :

75 వసంతాల భారత స్వాతంత్ర స్పూర్తిని ప్రతి ఒక్కరూ పుణికిపుచ్చుకోవాలని నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి అన్నారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలలో భాగంగా ఆదివారం ఉదయం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో శ్రీ సర్వోదయ కాలేజీ నుండి మహాత్మా గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

చిరు జల్లుల సవ్వడిలో , వందలాది విధ్యార్ధినీ విద్యార్ధుల సందడితో ఆహ్లాదకరమైన వాతావరణంలో ర్యాలీ జరిగింది.

జాయింట్ కలెక్టర్ రోణంకి కూర్మనాథ్, నగర పాలక సంస్థ మేయర్, కమిషనర్ తో కలసి జెండా ఊపి ర్యాలీ ని ప్రారంభించారు.

మది నిండా దేశభక్తి నింపుకుని, చేతిలో జాతీయ జెండా పట్టుకుని ప్రజలు, అధికారులు ఉత్సాహం తో పాల్గోన్నారు.

శ్రీ సర్వోదయ కాలేజీ నుండి మొదలైన ర్యాలీ మద్రాసు బస్టాండ్ లోని జవహర్లాల్ నెహ్రూ, ప్రకాశం పంతులు విగ్రహాలకు, విఆర్సి సెంటర్ లోని డా బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పమాలంకరణ చేస్తూ, గాంధీ విగ్రహం వద్ద ముగిసింది.

ఈ ర్యాలీలో నగరపాలక సంస్థ కమిషనర్ హరిత, జడ్పీ సీఈవో వాణి, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కనక దుర్గ భవాని, సెట్నెల్ సి ఇ ఓ పుల్లయ్య, కార్పొరేటర్ వాసంతి, విశేష సంఖ్యలో విధ్యార్ధినీ విద్యార్ధులు, ప్రజలు పాల్గోన్నారు.

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

జాతీయ ఎస్సీ కమిషన్ జోక్యంతోనే ఉదయగిరి నారాయణ కుటుంబానికి న్యాయం : మాజీ మంత్రి సోమిరెడ్డి

Spread the loveజాతీయ ఎస్సీ కమిషన్ జోక్యంతోనే ఉదయగిరి నారాయణ కుటుంబానికి న్యాయం : మాజీ మంత్రి సోమిరెడ్డి వారు స్పందించే వరకు జిల్లా అధికారుల్లో చలనం లేకుండా పోయింది నారాయణ కుటుంబసభ్యుల తరఫున ఎస్సీ కమిషన్ కు ధన్యవాదములు తెలియజేస్తున్నాం ఎస్సై కరిముల్లా ఆకృత్యాలపై త్వరలోనే మైనార్టీ కమిషన్ ను కూడా ఆశ్రయించబోతున్నాం జిల్లాలో ప్రధానంగా నెలకొన్న మూడు భయానక సమస్యలపై వామపక్షాలు, జనసేన, బీజేపీతో పాటు ప్రజాసంఘాలతో […]

You May Like

error: Content is protected !!