ముత్తుకూరులో కాన్షిరామ్ జయంతి వేడుకలు

ముత్తుకూరులో కాన్షిరామ్ జయంతి వేడుకలు
-: ముత్తుకూరు, మార్చి 15 (సదా మీకోసం) :-
మండలం కేంద్రం లోని ముత్తుకూరు సెంటర్ స్థానిక శ్రీ ఆంజనేయస్వామి దేవాలయ ప్రాంగణంలో బహుజన సమాజ్ వాది పార్టీ ఆధ్వర్యంలో కాన్షీరాం 88వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ముత్తుకూరు మండల బి.యస్.పి అధ్యక్షులు కోవూరు సురేష్ మాట్లాడుతూ అంబేడ్కర్ గారి వారసుడుగా కాన్షిరామ్ బహుజన వాదాన్ని ప్రతీ పల్లెకు కరపత్రాల ద్వారా తీసుకెళుతూ విశేష ఆదరణ పొందారని, ఆయన అడుగుజాడల్లో ప్రతీ వ్యక్తి నడవాలని దళిత యువతకు పిలపునిచ్చారు.
కార్యక్రమంలో యం.సుధాకర్, ఠాగూర్, బి.యస్.పి కార్యకర్తలు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.