అఖిల పక్ష నేతల రౌండ్ టేబుల్ సమావేశం
అఖిల పక్ష నేతల రౌండ్ టేబుల్ సమావేశం
-: నెల్లూరు నగరం, సెప్టెంబర్ 15 (సదా మీకోసం) :-
నెల్లూరు రంగనాయకుల పేటలోని మాద్రసాలో బుధవారం అఖిల పక్షాల నాయకులు MHPS రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లి, మౌలానా మొహమ్మద్ గులాం అరెస్ట్ కు నిరసనగా భవిష్యత్తు కార్యాచరణ కోసం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
అనంతరం అన్ని పార్టీల, ముస్లిం సంఘాల ఆమోదం తో భవిష్యత్తు కార్యాచరణ రూపొందించారు.
ముస్లిం నాయకుల అరెస్ట్ కు నిరసనగా శుక్రవారం నమాజ్ తర్వాత బార్కాస్ నుంచి VRC వరకు, VRC నుంచి గాంధీ బొమ్మ వరకు 500 మందితో భారీ ర్యాలీ నిర్వహించాలని తీర్మానించారు.
కార్యక్రమానికి అన్ని పార్టీల వారు అన్ని ముస్లిం సంఘాల వారు పెద్ద ఎత్తున తరలి రావాలని సూచించారు.