గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి

గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి
-: నూజివీడు, ఆగస్టు 6 (సదా మీకోసం) :-
కృష్ణాజిల్లా నూజివీడు లో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన గురువారం తీవ్ర సంచలనం కలిగిస్తోంది.
పట్టణ పరిధిలోని ఎం.ఆర్.అప్పారావు కాలనీ వద్ద గురుకుల పాఠశాల సమీపంలో షర్టు, లుంగీ ధరించి 35 ఏళ్ళ వయసున్న వ్యక్తి చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడు.
కాళ్ళు నేలను తాకడంతో అనుమానాస్పద మృతిగా పరిగణిస్తున్నారు.
ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పట్టణ ఎస్ఐ బి. శ్రీనివాసులు కేసు పూర్పపరాలను పరిశీలిస్తున్నారు.