మత్స్యకార హోరుకు వేలాదిగా తరలి రండి

0
Spread the love

మత్స్యకార హోరుకు వేలాదిగా తరలి రండి

మత్స్యకారులకు జరుగుతున్న అన్యాయాన్ని ముక్తకంఠంతో ప్రశ్నిద్దాం

మత్స్యకారుల భవిష్యత్తు కోసం ఐక్యంగా పోరాడుదాం

మార్చి 19న మత్స్యకార హోరు

నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్

నెల్లూరు, మార్చి 18 (స‌దా మీకోసం) :

మత్స్యకారుల ఉనికికి,ఉపాధికి, విఘాతం కలిగించే జీ.ఓ 217 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 19 న మాగుంట లే ఔట్ లోని పోలంరెడ్డి గార్డెన్స్ లో మత్స్యకారుల ఐక్య కార్యాచరణ కమిటీ ( జేఏసీ ) ఆధ్వర్యంలో మత్స్యకార హోరు పేరుతో నిరసన దీక్ష చేపడుతున్నామని అబ్దుల్ అజీజ్ ప్రకటించారు.

నెల్లూరు నగరం, మాగుంట లేఅవుట్ లోని దీక్షా స్థలాన్ని సందర్శించి, దీక్షా స్థలం వద్ద శుక్రవారం నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంఛార్జి అబ్దుల్ అజీజ్ గోడ పత్రికను విడుదల చేశారు.

ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 2800 సొసైటీలకు పొట్ట కొట్టే విధంగా లక్షలాది మంది మత్స్యకారులు రోడ్డున పడే విధంగా జగన్ రెడ్డి ప్రభుత్వం జీవో నెంబర్ 217 రూపొందించిందని అన్నారు. మత్స్యకారుల సంక్షేమంకు రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజ మెత్తారు. గ

తంలో ప్రభుత్వమే చేప పిల్లలను అందించేదని, వాటి పైన వచ్చిన సంపదను మత్స్యకారులు తీసుకునే వారని అన్నారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడ్డాక, మత్స్యకారులను పట్టించుకోకపోగా,మత్స్యకారుల సంపదను దళారులకు దొచిపెట్టే జీవోలను ప్రవేశపెట్టారని అన్నారు. 217 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న దీక్షకు సంబంధించి తెలుగుదేశం పార్టీ తరపున మాజీ మంత్రి వర్యులు, రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షులు కొల్లు రవీంద్ర తో పాటు మత్స్యకార సొసైటీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు.

కార్యక్రమంలో చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మలేపాటి సుబ్బానాయుడు, జెడ్ శివ ప్రసాద్, పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, కొండూరు పాల్ శెట్టి, మైనుద్దిన్, కప్పిర శ్రీనివాసులు, చెముకుల కృష్ణ చైతన్య, శ్రీనివాసులు నాయుడు,జలదంకి సుధాకర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!