ఎస్. వి. యూనివర్సిటీ లో ఔషధ విజ్ఞాన సదస్సు

0
Spread the love

ఎస్. వి. యూనివర్సిటీ లో ఔషధ విజ్ఞాన సదస్సు

ఇందుకూరుపేట, డిసెంబరు 29 (సదా మీకోసం)

ఔషధ విజ్ఞాన సదస్సు డిసెంబరు 28, 29 తేదీల్లో రెండు రోజుల పాటు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి సెనేట్ హాల్ నందు జరిగింది. పారంపర్య వైద్య మహా సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు యస్. చంద్రశేఖరరాజు అధ్యక్షతన జరిగిన సదస్సునకు కొత్తూరు లలిత భరద్వాజ దత్త పీఠం పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ మహేష్ స్వామీజీ అతిధిగా పాల్గొన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న మహేష్ స్వామి మాట్లాడుతూ సాంప్రదాయ వైద్యుల విజ్ఞానము వారి యొక్క మూలికల ప్రదర్శన. వైద్య విధానాలు చర్చా కార్యక్రమం భావితరాలకు అందించే గ్రంథస్థము మొదలైన కార్యక్రమాలను వైద్యులు, విద్యార్థులు కలసి నిర్వహించారని, విద్యార్థులంతా పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ సాంప్రదాయ విధానాన్ని కొనసాగిస్తూ పరిరక్షిస్తామని సభాముఖంగా ప్రమాణం చేయడం ఆనందంగా వుందన్నారు. సదస్సులో డాక్టర్ బి. యం. కే. రెడ్డి చైర్మన్ ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ బోర్డు గుంటూరు, విశ్వవిద్యాలయ ఉప కులపతి కే. రాజారెడ్డి, శ్రీలంక బౌద్ధ బిక్షువు శ్రీశ్రీశ్రీ బొద్దిహీన్, ప్రొఫెసర్ సావిత్రమ్మ, ప్రొఫెసర్ శ్రీరామ్ మూర్తి, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్, వృక్ష శాస్త్ర ప్రొఫెసర్లు, పారంపర్య వైద్యులు, వృక్షశాస్త్ర విద్యార్థులు మరియు రీసెర్చ్ స్కాలర్స్ అధ్యాపకులు పలు అంశాలపై ప్రసంగించారని తెలిపారు. తరతరాలుగా పుత్తూరు కట్టుకు పేరు గాంచిన వైద్యులు కృష్ణం రాజు కుటుంబానికి బెంగళూరు ట్రాన్స్ డిసిప్లినరీ యూనివర్సిటీ వారు పారంపర్య వైద్య రత్న అవార్డును ప్రొఫెసర్ హరిహర మూర్తి డాక్టర్ ప్రకాష్ చేతుల మీదుగా ప్రశంసా పత్రము, ధన్వంతరి విగ్రహం అందజేశారని చెప్పారు. కార్యక్రమంలో ఆయుర్వేద మందుల ప్రదర్శన అమ్మకాలు పారంపర్య వైద్యుల ఉత్పత్తులు ప్రదర్శన మరియు స్టాల్స్ ఏర్పాటు చేయడం, కార్యక్రమానికి ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, చత్తీస్ ఘడ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి పారంపర్య వైద్యులు విచ్చేశారని చెప్పారు. ఈ సదస్సును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారంపర్య వైద్య మహా సంఘం మరియు వృక్షశాస్త్ర విభాగము ఎస్. వి. యూనివర్సిటీ తిరుపతి వారు కలిసి నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలు రాష్ట్రాల నుంచి సాంప్రదాయ వైద్యులు, పశువైద్యులు ప్రకృతి వ్యవసాయ దారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!