రక్తదానం చేసి ప్రాణదాతలు కండి : అదాని కృష్ణపట్నం పోర్ట్ సీఈఓ జిజే రావు
రక్తదానం చేసి ప్రాణదాతలు కండి
రెడ్ క్రాస్ సహకారంతో మెగా వైద్య శిబిరం
నేడు 154 మంది రక్తదానం
అదాని కృష్ణపట్నం పోర్ట్ సీఈఓ జిజే రావు
ముత్తుకూరు, సదా మీకోసం :
రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని అ దాని కృష్ణపట్నం పోర్టు సీఈఓ జి జె రావు పిలుపునిచ్చారు.
మంగళవారం ఉదయం అదాని కృష్ణపట్నం పోర్టు ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సహకారంతో నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి రక్తదాన శిబిరాన్ని సి ఓ ఓ సంజయ్ కోత, అడ్మిన్ హెడ్ గణేష్ శర్మ తో కలసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు కార్మికులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి మరొకరు ప్రాణాలు దాతలుగా నిలవాలని ఆయన పేర్కొన్నారు.
రక్తం చాలా విలువైందన్నారు. ఆదాని కృష్ణపట్నం పోర్టు సామాజిక బాధ్యతలో భాగంగానే ప్రతి సంవత్సరం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తదానం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఎంతోమంది రక్తం దొరకక ఇబ్బందులు పడుతున్న వారికి మనం రక్తదానం చేయడం వలన ప్రాణదాతలుగా మిగులుతామన్నారు.
ఆదాని కృష్ణపట్నం పోర్టు సామాజిక బాధ్యతల భాగంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ మెగా రక్తదాన శిబిరం ఏర్పాటుచేసి రక్త దానం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి మరోక ప్రాణదానం చేయాలని ఈ సందర్భంగా ఆయన పోర్టు ఉద్యోగులు కార్మికులకు పిలుపునిచ్చారు.
ఈరోజు 154 మంది రక్తదానం చేశారు. వారిని ఈ సందర్భంగా సి ఈ ఓ అభినందించారు.
అనంతరం రక్తదానం చేసిన దాతలకు సర్టిఫికెట్లను సీఈవో జీజేరావు అందించారు.
ఈ కార్యక్రమంలో సిఓఓ సంజయ్ కొత్త, గణేష్ శర్మ, కార్పొరేట్ అఫైర్స్ హెడ్ జి వేణుగోపాల్ ,మనీష్ దావే, వేణుగోపాల్ రెడ్డి, విజయ్ మజ్జి, సిహెచ్ శ్రీనివాస్, గంగా సతీష్, గుడివాడ శ్రీకాంత్, సెక్యూరిటీ డీజీఎం మనోహర్ బాబు, జయలాల్, రాజేష్ రంజన్, రామకృష్ణ, రెడ్ క్రాస్ ప్రతినిధులు మధుసూదన్, భాస్కర్, మస్తానయ్య, సాయిరాం, పోర్టులోని వివిధ విభాగాలు హెచ్వోడీలు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.