సిసి రోడ్ల పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

సిసి రోడ్ల పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి
1.60 కోట్ల రూపాయల నిధులతో సీసీ రోడ్లు పనులు
నెల్లూరు రూరల్, మార్చి 1 (సదా మీకోసం) :
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 2వ డివిజన్, గణేష్ గార్డెన్లో 1.60 కోట్ల రూపాయల నిధులతో సీసీ రోడ్లు పనులకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నగర మేయర్ పొట్లూరి స్రవంతి జయవర్ధన్, రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొటంరెడ్డి మాట్లాడుతూ, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినతరువాత గ్రామాలు, విలీన గ్రామాలు, పేదమధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివశించే ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు.
నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలపై ఒక చక్కటి ప్రణాళిక రూపొందించి, రాజకీయ ద్వేషాలకు, రాజకీయ విభేదాలకు తావులేకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినతరువాత 2వ డివిజన్లో దాదాపు 9 కోట్ల 57 లక్షల రూపాయలతో మా సోదరులు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు.
కార్యక్రమంలో విజయడైరీ ఛైర్మెన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, 1వ డివిజన్ కార్పొరేటర్ జానా నాగరాజు, 2వ డివిజన్ కార్పొరేటర్ పడిగనేటి రామ్మోహన్, ఏయంసి ఛైర్మెన్ యేసు నాయుడు, రాష్ట్ర ఎమ్.వైఎస్.ఎమ్.ఇ. డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ కరీముల్లా, వైసీపీ సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, హరిబాబు యాదవ్, స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.