జూలై 15న ఏపీఈజేయూ ఆధ్వ‌ర్యంలో బొనిగి ఆనందయ్య మందు పంపిణీ

0
Spread the love

జూలై 15న ఏపీఈజేయూ ఆధ్వ‌ర్యంలో బొనిగి ఆనందయ్య మందు పంపిణీ

-: ముత్తుకూరు, జూలై 12 (స‌దా మీకోసం) :-

బొనిగి ఆనందయ్యను ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్స్ యూనియన్ (APEJU) రాష్ట్ర కన్వీనర్  గట్టుపల్లి శివకుమార్, నెల్లూరు జిల్లా కన్వీనర్ ఉడతా రామకృష్ణ ల ఆధ్వర్యంలో సోమవారం కృష్ణ‌పట్నం లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కో – కన్వీనర్  పి.జె.రమేష్ రెడ్డి, ఆనందయ్య సోదరులు బోనిగి శీనయ్య, సభ్యులు నీళ్ల చిన్నారావు యాదవ్, పిగిలం లక్ష్మీ నారాయణ, సదామీకోసం పత్రిక రిపోర్టర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆనందయ్య ఆయుర్వేద మందును జూలై 15వ తేదీ న (APEJU) యూనియన్ సభ్యులకు మాత్రమే ఆనందయ్య లేదా ఆయన సోదరుల ఆధ్వర్యంలో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

వివరాలకు ఈ క్రింది 9347112031, 9440589430 నెంబర్లకు సంప్రదించాల‌ని కోరారు.

 

   

   

   

   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!