లీలా మోహన్ కృష్ణ కు ఉత్తమ సేవా పురస్కారం
లీలా మోహన్ కృష్ణ కు ఉత్తమ సేవా పురస్కారం
-: కోట, ఆగస్టు 7 (సదా మీకోసం) :-
ఎం. వి .రావు.ఫౌండేషన్, శంకర్ ట్రస్ట్ ల వ్యవస్థాపకులు ఎం. లీలా మోహన్ కృష్ణ కు తెలంగాణ కు చెందిన శ్రీ సుధ సేవాసమితి ఛైర్మెన్ పి.సుధా మాధురి ఉత్తమ సేవా పురస్కారం ను శుక్రవారం అందచేశారు.
తెలంగాణ రాష్ట్రం వరంగల్ కు చెందిన శ్రీ సుధ సేవ సమితి ఛైర్మెన్ పి.సుధ మాధురి ఎం. లీలా మోహన్ కృష్ణ ఎం.వి.రావు ఫౌండషన్, శంకర్ ట్రస్ట్ ల ద్వారా నిరుపేదలకు చేస్తున్న సేవా కార్యక్రమాల ను వీక్షించి ఆ సంస్థల వ్యవస్థాపకుడు ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ సోషల్ ఏక్టివిస్టుగా కోవిడ్ వారియర్ హోనౌర్ ప్రశంసా పత్రం తో అభినందించారు.
ఎం. లీలా మోహన్ కృష్ణ మెడికల్, ఫుడ్, సోషల్ సర్వీస్, అవగాహన, బ్లడ్ మోటివేటర్ గాను కోవిడ్ 19 లాక్ డౌన్ సమయం లో చేసిన ఈ కార్యక్రమాలను గుర్తించి తమ సంస్థ ద్వారా ఈ పురస్కారం అందచేసామని పి.సుధ మాధురి తెలిపారు.
ఎం. లీలా మోహన్ కృష్ణ ఇంకా సేవాకార్యక్రమాలు నిర్వహించి అందరి ఆదరాభిమానాలు అందుకోవాలని కోరుతూ పురస్కారం అందచేశారు.
సందర్భంగా ఎం. లీలా మోహన్ కృష్ణ ను పలువురు అభినందించారు.