ఆ భగవంతుని ఆశీస్సులు చంద్రబాబు మీద ఉండాలి
డిప్యూటీ మేయర్ రూప్ కూమర్ యాదవ్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు
కేకు కట్ చేసి మహిళలకు చీరలు పంపిణీ చేసిన రూప్ కూమర్ యాదవ్
నెల్లూరు నగరం, ఏప్రిల్ 20 (సదా మీకోసం) :

నెల్లూరు నగరం, జేమ్స్ గార్డెన్ లోని నగర డిప్యూటీ మేయర్ కార్యాలయంలో ఆదివారం నాడు రూప్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు.
అనంతరం వందలాది మంది మహిళలకు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దార్ల వెంకటేశ్వర్లు చీరలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినం సందర్భంగా నెల్లూరు నగర నియోజకవర్గం లో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సూచనల మేరకు కేకు కటింగ్, వందలాది మంది మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగిందన్నారు.
స్థానిక కార్పొరేటర్లు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల తో కలిసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో మా నాయకుడు చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానన్నారు.
ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఆ భగవంతుని ఆశీస్సులు చంద్రబాబు నాయుడు మీద ఉండాలని కోరుకుంటున్నానన్నారు.
1995 లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా పనిచేశారో అదే స్ఫూర్తితో ఇప్పటికీ పని చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని అని అన్నారు.
కార్యక్రమంలో కార్పొరేటర్లు అస్మమైనుద్దీన్, గోగుల నాగరాజు నాయకులు నిశ్చల్ కుమార్ రెడ్డి, వడ్లమూడి చంద్ర, అల్లంపాటి జనార్దన్ రెడ్డి, మైనార్టీ నాయకులు హాజీ తదితరులు పాల్గొన్నారు.



