బాస్ (చంద్రబాబు) చెప్తె సిద్దం… స్పష్టం చేసిన బొల్లినేని
బాస్ (చంద్రబాబు) చెప్తె సిద్దం… స్పష్టం చేసిన బొల్లినేని
-: కావలి,జూలై 16 (సదా మీకోసం) :-
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తనకు ఏ ఆదేశాలిస్తే ఆ ఆదేశాలు పాటించడానికి సిద్ధంగా వున్నానని ఉదయగిరి మాజీ శాసనసభ్యులు బొల్లినేని రామారావు స్పష్టం చేశారు.
కావలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా బొల్లినేని నియమిస్తున్నారని వస్తున్న వార్తల నేపథ్యమంలో ఆ వార్తలో నిజానిజాలు తెలుసుకునేందుకు చేసిన ప్రయత్నంలో బాగంగా ఆయన పై విధంగా స్పందించారు.
తెలుగుదేశం పార్టీ బాస్ చంద్రబాబు వెళ్ళమని చెప్తే కావలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యతలు స్వీకరిచడానికి సిద్దంగా ఉన్నట్లు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
తమ పార్టీ జిల్లా నాయకులు కూడా కొంతమంది కావలి ఇన్ఛార్జ్ బాధ్యతల విషయాన్ని ప్రస్తావించారని , వారికి కూడా బాస్ చంద్రబాబు ఎలా చెబితే అలా నడుచుకుంటానని చెప్పానని తెలిపారు.
ఉదయగిరి నియోజకవర్గంలో, కావలి నియోజకవర్గంలోనూ తనకు హితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, అభిమానులు వున్నారని, వారిని కూడా సంప్రదించి వారి అభిప్రాయాల్ని కూడా పరిగణలోకి తీసుకుని పూర్తి స్థాయి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.
కావలి తనకు స్వంత ఊరు లాంటిదని, కావలిలోని ఏబీఎమ్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివానన్నారు.
బొలినేని రామారావు తన మాటల్లో కావలి ఇన్ఛార్జ్ పదవిపట్ల మోజు ఉన్నట్లు చెప్పకపోయినా, విముఖత మాత్రం వ్యక్తం చేయక పోవడం గమనార్హం. ఇక చంద్రబాబు ఆదేశిస్తే మాత్రం, కావలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు బొల్లినేని చేపట్టే అవకాశం కన్పిస్తుంది.