ఆమె కార్పొరేషన్ కమీషనరా…! జిల్లా అధికారా…!
ఆమె కార్పొరేషన్ కమీషనరా…! జిల్లా అధికారా…!
- ఐ.ఏ.ఎస్.ల కార్యక్రమాలతో బిజి అయిన కమీషనర్
- మేయర్ తో కలిసి ఒక్క కార్యక్రమంలో పాల్గొనని కమీషనర్
- కార్పొరేషన్ పరిధిలో ప్రధమ పౌరు రాలు మేయర్
- ఆమె ప్రజలే కాక, కార్పొరేషన్ అధికారులకు కూడా మేయరే
నెల్లూరు ప్రతినిధి, ఏప్రిల్ 15 (సదా మీకోసం) :
నెల్లూరు నగరపాలక సంస్థకు నూతనంగా వచ్చిన కమీషనర్ జాహ్నవి వ్యవహారం పలు విమర్శలకు దారి తీస్తుంది.
నగరపాలక సంస్థ పరిధిలో ప్రధమ పౌరురాలు అంటే గుర్తుకు వచ్చేది మేయర్.
నగరపాలక సంస్థ మేయర్ గా ప్రస్తుతం పొట్లూరి స్రవంతి జయవర్ధన్ ఉన్నారు.
ప్రతిపక్షం అనేది లేకండా అధికార పార్టీ గంపగుత్తుగా తన కార్పొరేటర్లను గెలిపించుకోగా, ఏక్రగీవంగా అధికార పార్టీ ఎన్నుకున్న మేయర్ పొట్లూరి స్రవంతి జయవర్ధన్.
ఆ రకంగా ఆమె నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అందరు ప్రజలకు, ఆ కార్యాలయంలో పని చేసే ప్రతి ఉద్యోగికి, అధికారులకు కూడా మేయరే.
కొత్తగా వచ్చిన కమీషనర్ బాధ్యతలు తీసుకున్న వెంటనే మేయర్‌ని మర్యాదపూర్వకంగా కలవడం అనేది ఆనవాయితి.
కాని ఆ ఆనవాయితీని కమీషనర్ జాహ్నవి తుంగలో తొక్కారన్న అపవాదు ఉంది.
దర్గాలో జరిగిన విలేఖరుల సమావేశంలో కూడా రూరల్ ఎమ్మెల్యే మాట్లాడినంతేసేపు పక్కనే ఉన్న కమీషనర్, మేయర్ స్రవంతి జయవర్ధన్ మాట్లాడడం మొదలు పెట్టిన తరువాత అక్కడ నుండి చల్లగా జరుకున్నారన్న విషయం అక్కడ ఉన్న కార్యకర్తలు చెవులు కొరుక్కొవడం గమనార్హం.
ఈ మధ్యనే జరిగిన పూలే జయంతి, అంబేద్కర్ జయంతిల కార్యక్రమాలలో వారి విగ్రహాల వద్ద నివాళులర్పించే క్రమంలో కూడా మేయర్‌తో కలిసి కమీషనర్ పాల్గొన్న దాఖలాలు లేవు.
నేను ఐ.ఏ.ఎస్. నేను ఐ.ఏ.ఎస్.లు పాల్గొనే కార్యక్రమాలలో మాత్రమే పాల్గొంటాను అనే ఆలోచనలో ఉన్నారా అనే అనుమానాలకు కమీషనర్ జాహ్నవి తావిస్తున్నారు.
ఈ మధ్య జరిగిన జయంతులలో జిల్లా అధికారులైన కలెక్టర్, జాయింట్ కలెక్టర్లతో మాత్రమే పాల్గొనడం అదే విషయాన్ని రూఢీ చేస్తుందంటూ కార్పొరేషన్ కార్యాలయంలో ఉద్యోగులు చెవులు కొరుక్కుంటున్నారు.
కార్పొరేషన్ కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించే ముందు ఐ.ఏ.ఎస్. అధికారులను మర్యాదపూర్వకంగా కలిసిన వారికి, కమీషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన తరువాత మేయర్‌ని కలవాలన్న విషయం తెలియదా అని పలువరు అధికార పార్టీ కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారు.
నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ గా గతంలో పనిచేస్తున్న కె. దినేష్ కుమార్ బదిలీ కావడంతో ఆయన స్థానంలో నెల్లూరు జిల్లాలో హౌసింగ్ జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తున్న జాహ్నవి ని నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ గా నియమించారు. వచ్చినప్పటి నుండి మేయర్‌తో అంటీ ముట్టనట్టే వ్యవహరిస్తున్నారనే అపవాదును మూటగట్టుకోవడం గమనార్హం.
మేయర్‌తో అలా ఉండడానికి కమీషనర్ చుట్టు ఉన్న కోటరీ కారణమా? లేక ఏవరైనా మేయర్ పై ఆ విధంగా అభిప్రాయంలోకి వచ్చే విధంగా బలంగా నాటారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఒక సంస్థ గాడిలో నడవాలన్నా అభివృద్ధి పథంలా ముందుకు పోవాలన్నా ఆ సంస్థలో పని చేసే ముఖ్యలు కలిసి మెలసి పనిచేయాలి,
ఇలా నా దారి ఐ.ఏ.ఎస్ దారి అంటే ఎలా అని, కలసి మెలసి నడవాలని పలువురు కార్పొరేషన్ ఉద్యోగులు, ప్రజలు కోరుకుంటున్నారు.
ఇప్పటికైనా కమీషనర్ తన పంథా మార్చుకొని, మెయర్‌తో కలసి నెల్లూరు నగరపాలక సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని కోరుకుందాం..!