దిశ చట్టం వెంటనే అమలు చేయాలి : అంబేడ్కర్ ఇండియా మిషన్

దిశ చట్టం వెంటనే అమలు చేయాలి : అంబేడ్కర్ ఇండియా మిషన్
-: ఇందుకూరుపేట, ఆగస్టు 17 (సదా మీకోసం) :-
గుంటూరులో బిటెక్ చదువుతున్న విద్యార్ధిని నల్లపు రమ్యను అత్యంత దారుణంగా హత్య చేసిన శివ అనే ముద్దాయిని దిశ చట్టం కింద కేసును నమోదు చేసి వెంటనే శిక్ష అమలు చేయాలని ఇందుకూరుపేట మండల అంబేడ్కర్ ఇండియా మిషన్ మండల కమిటీ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ లో అర్జీని సమర్పించారు.
ఈ సందర్భంగా అ. ఇ. మి. డివిజన్ కన్వీనర్ పొలవరపు కార్తికేయ మాట్లాడుతూ మహిళలకు రక్షణ కల్పించే చట్టాలు ఎన్ని వున్నా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.
రమ్య లాంటి ఎందరో ఆడపిల్లలు చదువుల కోసం బయటకు వెళ్లినప్పుడు విపత్కర పరిస్థితులు ఎదురై వాళ్ళ జీవితం మధ్యలోనే ముగుస్తుందని, దీనికి బాద్యులైన వారికి కఠిన శిక్ష పడాలని కోరారు.
దళిత బిడ్డ రమ్యకు జరిగిన అన్యాయం మరో బిడ్డకు జరగకుండా వుండాలంటే దిశ చట్టం అమలు చేసి ముద్దాయి శివకి వెంటనే శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో సభ్యులు బొచ్చు సాంబశివ, గొడుసు సునీల్, బండి వినోద్, బొచ్చు జనార్దన్, బొచ్చు వంశీ, గిద్దలూరు గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.