అది అన్ని లక్షలకు అమ్ముడు పోయిందా…!

0
Spread the love

అది అన్ని లక్షలకు అమ్ముడు పోయిందా…!

సాధారణంగా మనం ఏదైనా వస్తువు కొంటే సగం ధరకే అమ్మేస్తాం. కానీ వస్తువు బాగుంటే.. ఒక్కోసారి సగం ధర కంటే ఎక్కువ కూడా రావొచ్చు. ఈ నేపథ్యంలో లండన్‌కు చెందిన ఓ వ్యక్తికి జాక్‌పాట్ తగిలింది. అతడు 90 పైసలు పెట్టి కొన్న చెంచా లక్షల రూపాయలకు అమ్ముడుపోయింది. ఇంతకీ ఆ వస్తువు ఏంటి? దానికి ఎందుకు ఇంత ధర పలికిందో వివరంగా తెలుసుకుందాం.

లండన్‌లో ఓ వ్యక్తి కార్​ బూట్​ సేల్​కు వెళ్లాడు. అతడికి అక్కడ ఓ స్పూన్​ కనిపించింది. ఎందుకో అది ఆకర్షించింది. పాతగా తుప్పు పట్టి ఉంది. ఓవైపు సగం వంగిపోయినట్టు ఉంది. సాధారణంగా అయితే దానితో ఏం పని.. ఎవరూ తీసుకోరు. ఏహే ఇందులో ఏముంది అనుకుంటారు. కానీ ఓ వ్యక్తి ఆ చెంచాను చూసిన వెంటనే ఏదో ప్రత్యేకత ఉందనుకున్నాడు.

కేవల 90 పైసలకు స్పూన్‌ను కొన్నాడు. కానీ లక్షల్లో ఎలా ధర వచ్చింది. స్పూన్ కొన్న ధరకు అమ్మిన ధరకు 12 వేల రేట్ల తేడా.. అంటే ఎంతో తెలుసా 2 లక్షలు అన్నమాట. కొన్నది 90 పైసలకే కానీ అమ్మింది మాత్రం 2 లక్షలకు. ఈ ధర అందరిని అవాక్కయ్యేలా చేసింది. కొన్న వెంటనే స్పూన్ ను ఆ వ్యక్తి ఇంటికి తీసుకెళ్లాడు. కొన్ని రోజుల తర్వాత వేలానికి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. వేలం నిర్వాహకులను కూడా సంప్రదించాడు. అక్కడ దానిని పరిశీలించగా.. అసలు విషయం తెలిసింది. అది 13వ శతబ్దానికి చెందిన స్పూన్ అని. సరే కొన్నది 90 పైసలకేగా.. 51,712 రూపాయలకు వేలంలో పెట్టాడు. ఎంతో కొంత వస్తుంది కదా అనుకున్నాడు. ఎలాగైనా.. పాత కాలం నాటి స్పూన్ కాబట్టి ధర ఎక్కువనే వస్తుందనుకున్నాడు. కానీ మరి అంత ఎక్కువ వస్తుందని ఊహించలేదు.

ఇలా జరిగిన తర్వాత కొన్ని రోజులకు ఆ స్పూన్ విషయం అందరికీ తెలిసింది. 13వ శతాబ్దం స్పూన్ అంటే మాటలా? అనుకున్నారంతా. వేలంలో ఎగబడ్డారు. స్పూన్ వంగిపోయిందా? పాతదా? అని ఎవరూ చూడలేదు. చివరకు ఆ స్పూన్ 1,97,000 రూపాయలకు అమ్ముడుపోయింది. ట్యాక్స్, ఇతర ఛార్జీలు అన్నీ కలిపి 2 లక్షల రూపాయలు దాటింది. టైమ్ పాస్‌కు వెళ్లి.. 90 పైసలకు కొని.. 2 లక్షలకు అమ్ముకున్న వ్యక్తిని చూసి అందరూ అదృష్టవంతుడు అని ప్రశంసలు కురిపిస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

error: Content is protected !!