మార్కెట్ ను పరిశుభ్రంగా ఉంచుకోవాలి : మేయర్ స్రవంతి జయవర్ధన్

Spread the love

మార్కెట్ ను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

దుకాణ‌లు వెనుక‌కు జ‌రుపుకోవాలి

మేయర్ స్రవంతి జయవర్ధన్

నెల్లూరు కార్పొరేష‌న్‌, ఏప్రిల్ 7 (స‌దా మీకోసం) :

జిల్లా వ్యాప్తంగా ప్రముఖ కూరగాయల విక్రయ కేంద్రంగా నడుస్తున్న ఏసీ సుబ్బారెడ్డి మార్కెట్ ను పరిశుభ్రంగా ఉంచుకోవడం మ‌న‌ అందరి బాధ్యత అని నగర మేయర్ స్రవంతి జయవర్ధన్ పేర్కొన్నారు.

అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి మేయర్ కూరగాయల మార్కెట్ ను గురువారం పరిశీలించారు.

ఈ సందర్భంగా మార్కెట్టు దుకాణదారులతో మాట్లాడుతూ కూరగాయల వ్యర్ధాలను స్థానికంగానే పారబోయడంతో పశువుల సంచారం ఎక్కువవుతోందని, వ్యాపారస్తులంతా ఆ పద్ధతిని మార్చుకోవాలని సూచించారు.

వినియోగదారులు దుకాణాల మధ్య సంచరించేందుకు ఇరుకుగా అనిపిస్తున్న కారణంగా, దుకాణాలను కాస్త వెనుకకు జరుపుకోవాలని మేయర్ ఆదేశించారు.

స్వచ్ఛ నెల్లూరు సాధనకు ప్రతి ఒక్కరూ సహకరించి, నగరానికి ఉత్తమ ర్యాంక్ వచ్చేలా కృషి చేయాలని మేయర్ ఆకాంక్షించారు.

 కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ ఏసు నాయుడు, 38 వ డివిజన్ కార్పొరేటర్ దాసరి అమృత, వైసిపి నాయకులు పాల్గొన్నారు.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

సచివాలయ వ్యవస్థలో వాలంటీర్లే కీలకం

Spread the loveసచివాలయ వ్యవస్థలో వాలంటీర్లే కీలకం వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మేయర్ స్రవంతి జయవర్ధన్ నెల్లూరు రూర‌ల్‌, ఏప్రిల్ 7 (సదా మీకోసం) : పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అందించేందుకు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆలోచనలతో రూపొందించిన సచివాలయ వ్యవస్థలో వలంటీర్ల పాత్ర ఎంతో కీలకమని, వారి సేవలను గుర్తిస్తూ ప్రోత్సాహక పురస్కారాలు అందించడం గొప్ప విషయమని మేయర్ స్రవంతి జయవర్ధన్ పేర్కొన్నారు. స్థానిక […]

You May Like

You cannot copy content of this page