సచివాలయ వ్యవస్థలో వాలంటీర్లే కీలకం

0
Spread the love

సచివాలయ వ్యవస్థలో వాలంటీర్లే కీలకం

వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

మేయర్ స్రవంతి జయవర్ధన్

నెల్లూరు రూర‌ల్‌, ఏప్రిల్ 7 (సదా మీకోసం) :

పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అందించేందుకు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆలోచనలతో రూపొందించిన సచివాలయ వ్యవస్థలో వలంటీర్ల పాత్ర ఎంతో కీలకమని, వారి సేవలను గుర్తిస్తూ ప్రోత్సాహక పురస్కారాలు అందించడం గొప్ప విషయమని మేయర్ స్రవంతి జయవర్ధన్ పేర్కొన్నారు.

స్థానిక 19 వ డివిజన్ లెక్చరర్స్ కాలనీ సచివాలయంలో గురువారం ఏర్పాటు చేసిన వలంటీర్ల ప్రోత్సాహక పురస్కారాల కార్యక్రమంలో మేయర్ స్రవంతి జయవర్ధన్, వైసీపీ రాష్ట్ర కార్యద్దర్సీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ, వార్డు వాలంటీర్ల ఉగాది పురస్కారాలకు ఎంపికైన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మన దేశంలో కానీ, ప్రపంచంలో కానీ ఎక్కడా లేని విధంగా పరిపాలనలో స్వర్ణయుగం తెచ్చేలా 2019 ఆగస్టు 15న వాలంటీర్లను సచివాలయ వ్యవస్థ లో భాగంగా మొదలుపెట్టారని తెలిపారు.

ప్రపంచాన్నే వణికించిన కరోనా సమయంలో సైతం ప్రజలకు కావలసిన సేవలు, ప్రజలకు అందాల్సిన పథకాలను ప్రభుత్వం నుంచి చేరవేసే రథసారథులుగా వలంటీర్లు నిలిచారని కొనియాడారు.

వలంటీర్ల విశిష్ట సేవలను మెచ్చిన ముఖ్యమంత్రి సేవా మిత్రా, సేవ రత్న, సేవా వజ్ర పేర్లతో ఉగాది ఉత్సవాలను ప్రత్యేకంగా నిర్వహించడం శుభ పరిణామం అని మేయర్ ప్రశంసించారు.

అవార్డులు అందుకున్న వాళ్లకి, అందుకొని వాళ్ళకి కొద్దిపాటితేడా మాత్రమే ఉన్నదని, అవార్డులు రానివాళ్లు మరింత కృషి చేసి రాబోయే సంవత్సరంలో గౌరవాన్ని అందుకోవాలని మేయర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, 19 వ డివిజన్ కార్పొరేటర్ యం. జ్యోతి ప్రియ, మదన్ మోహన్ రెడ్డి వార్డ్ ఇంఛార్జి, తదితరులు నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!