అఖండ షూటింగ్ లొకేషన్ కోసం కడప జిల్లా లో దర్శకులు బోయపాటి శ్రీను
అఖండ షూటింగ్ లొకేషన్ కోసం కడప జిల్లా లో దర్శకులు బోయపాటి శ్రీను
-: కడప, జూన్ 28 (సదా మీకోసం) :-
ద్వారకా క్రియేషన్స్ పతాకంపై నట సింహా నందమూరి బాలకృష్ణ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అఖండ చిత్రం యొక్క షూటింగ్ కోసం లోకేషన్స్ చూసే నిమిత్తం సోమవారం కడప గడపలో సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను అడుగు పెట్టారు.
ఈ సందర్భంగా ఆయన్ను గండికోటలో ప్రొద్దుటూరు పట్టణ నందమూరి యువసేవా సమితి ఆధ్వర్యంలో పుష్ఫగుచ్ఛంతో సాదరంగా ఆహ్వానం పలికినారు.మెమొంటో అందించి, శాలువా కప్పి ఘనంగా సన్మానించినారు.
ప్రొద్దుటూరు-అర్చన థియేటర్లో కోనేటి ఓబుళరెడ్డి ఆధ్వర్యంలో లెజెండ్ చిత్రం దక్షిణ భారతదేశం లోనే అత్యధికంగా 1116 రోజులు ప్రదర్శింపబడి చరిత్రపుటల్లో నిలిచిపోయిన సందర్భాన్ని ఆయనకు గుర్తు చేశారు.
ప్రొద్దుటూరు పట్టణానికి, పట్టణ నందమూరి అభిమానులకు గర్వకారణం గా అఖండ చిత్రానికి సంబంధించిన ఆడియో ఫంక్షన్ గానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్ గానీ, మరేదైనా కార్యక్రమంగానీ మన ప్రొద్దుటూరులో నిర్వహించవలసిందిగా వారు కోరారు.
సి.గుర్రప్పయాదవ్(అడ్వకేట్), సింహా శేఖర్, మాదాసు రాజశేఖర్, సి.సిద్ధయ్య, సిజె.వెంకటసుబ్బయ్య, జి.యస్.చాంద్ బాష, యమ్మనూరు ఆంజనేయులు, కుళాయప్ప, గోమేధికమ్ సుదర్శన్ తదితరులు పాల్గొనడం జరిగింది.